సాధారణంగా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో  పెద్ద పెద్ద కటౌట్ లు , హోర్డింగ్ లు థియోటర్స్ దగ్గర వెలుస్తూంటాయి. అంతేకాకుండా  పెద్ద పెద్ద కటౌట్‌లకి పూల దండల అలంకరణలూ, పాలాభిషేకాలు చేస్తుంటారు ఫ్యాన్స్. ఇంక థియోటర్ లో ఫ్యాన్స్ చేసే రచ్చకు అయితే తిరుగే ఉండదు.

కానీ  ఓ హీరోయిన్‌కి భారీ కటౌట్‌ పెట్టడమనేది మాత్రం ఎప్పుడో గానీ జరగదు. గతంలో అనుష్క సినిమా రిలీజ్ అప్పుడు ఇలా చేసారు. మళ్లీ సమంత సినిమా కోసం కటట్ పెట్టి ఫ్యాన్స్‌  హడావిడి చేస్తున్నారు. సమంత అక్కినేని  నటించిన ‘ఓ బేబి’ మూవీ ఈనెల 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లలోనూ సమంత బాగా యాక్టివ్ గా పాల్గొంటోంది.

ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్  ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి 70 ఎంఎం ముందు ఈ భారీ కటౌట్ ఏర్పాటుచేశారు అభిమానులు. సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం  `ఓ బేబి` . సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. 

ఈ చిత్రంలో  ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి  రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సాంకేతిక వ‌ర్గం: మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌, కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ, ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,ఆర్ట్‌:  విఠ‌ల్‌.కె, ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థ‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌, స‌హ నిర్మాత‌లు:  విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌.