ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. దీనితో ఈ చిత్రం మెమొరబుల్ గా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకు వచ్చింది. రామరాజుగా చరణ్ లుక్, నటన నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. దీనితో ఈ చిత్రం మెమొరబుల్ గా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన లీకులతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. RC 15 విషయంలో కూడా శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. రాంచరణ్ వివిధ గెటప్స్ లో అదరగొట్టేస్తున్నారు అని టాక్. 

ఇక ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు ఈ మూవీలో తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఎస్ జె సూర్య పాత్ర ఈ మూవీలో కంఫర్మ్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సముద్ర ఖని కూడా నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు నటిస్తున్నారా లేదా అనే విషయంలో దిల్ రాజు సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 

ఇంతలో పుకార్లు ఎక్కువయ్యాయి. కొంతమంది అప్ కమింగ్ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవన్నీ ఫేక్ న్యూస్ అని దిల్ రాజు బ్యానర్ క్లారిటీ ఇచ్చింది. తమ చిత్రాలకు కాస్టింగ్ , ఆడిషన్స్ నిర్వహించే అధికారం ఏ ఏజెన్సీ సంస్థకు లేదని.. ప్రజలు దీనిని గమనించాలి అని పేర్కొంది. 

రాంచరణ్ ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. 

Scroll to load tweet…