Asianet News TeluguAsianet News Telugu

'పుట్టింది సూర్యకాంతం' ఓ బేబీ లిరికల్ సాంగ్!

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న నూతన చిత్రం 'ఓ బేబీ'. 

o baby title song lyrical video
Author
Hyderabad, First Published May 31, 2019, 4:58 PM IST

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న నూతన చిత్రం 'ఓ బేబీ'. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్. నందిని రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. తాజాగా సినిమాలో టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు లక్ష్మీభూపాల్ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి పాడారు.

ఈ పాట ద్వారా సినిమాలో సమంత పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. సీనియర్ నటి లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాను రిలీజ్ చేయనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios