కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఇంట్లో ఉన్న కూడా వదిలేలా లేదు. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. `నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎవరూ చింతించకండి. ప్రస్తుతం నేను చాలా బాగున్నాను. నేను, నా ఫ్యామిలీ  ఐసోలేట్‌ అయ్యాం. వైద్యుల పర్యవేక్షణలో వారి సూచనలను ఫాలోఅవుతున్నాను. నన్ను ఇటీవల కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని ప్రార్థిస్తున్నా. అందరు సురక్షితంగా ఉండండి` అని తెలిపారు ఎన్టీఆర్. 
 

కరోనా వరుసగా సెలబ్రిటీలను వెంటాడుతుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌, దిల్‌రాజు, బండ్ల గణేష్‌, అల్లు అరవింద్‌, ఇటీవల అల్లు అర్జున్‌, కళ్యాణ్‌ దేవ్‌లకు కరోనా సోకింది. బన్నీ ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. కళ్యాణ్‌ దేవ్‌ కూడా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కి కరోనా పాజిటివ్‌రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గతేడాది `ఆర్ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌కి, రాజమౌళి ఫ్యామిలీకి కరోనా సోకింది.

ఇటీవల అలియా భట్‌కి కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్‌కి రావడం విచారకరం. ప్రస్తుతం ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామ్‌చరణ్‌ మరో హీరో. అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా వల్ల సినిమా షూటింగ్‌ని నిలిపివేశారు.పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని అక్టోబర్‌ 13న, దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.