మాస్‌ సినిమాలతో మెప్పిస్తున్న బాలయ్య నేడు(జూన్‌ 10)తన 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆయనకి అనేక సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ.. నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఆయన లెగసీని నేటి తరానికి అందిస్తున్నారు. క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల ఆడియెన్స్ ని అలరించడంలో దిట్ట బాలయ్య. ఇప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మాస్‌ సినిమాలతో మెప్పిస్తున్న బాలయ్య నేడు(జూన్‌ 10)తన 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి అనేక సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

వారిలో ముందున్నాడు అబ్బాయి ఎన్టీఆర్‌. బాబాయ్‌కి ఎర్లీ మార్నింగ్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు. `జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్‌. మరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను` అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా బాబాయ్ బాలయ్యది ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు ఎన్టీఆర్‌. మరోసారి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. మరో అబ్బాయి కళ్యాణ్‌ రామ్‌ సైతం `మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల`ని బర్త్ డే విషెస్‌ తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

వీరితోపాటు అనేక సినీ ప్రముఖులు బాలకృష్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుధీర్‌బాబు, హీరో శ్రీకాంత్‌, నిర్మాత కోన వెంకట్‌, నారా రోహిత్‌, బాలయ్య కూతురు నారా బ్రహ్మణి, దర్శకుడు సంపత్‌ నంది, తనతో నెక్ట్స్ సినిమా చేయబోతున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని, అలాగే పలు నిర్మాణ సంస్థలు బర్త్ డే విషెస్‌ తెలిపాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…