Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన అభిమాని, ఉలిక్కిపడ్డ తారక్.. పైకి దూసుకొచ్చి ఏం చేశాడంటే..?

ఓ అభిమాని వల్ల. అతను చేసిన పనికి.. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు తారక్. ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అయిపోయింది పరిస్థితి. 
 

NTR Fans Shocking Behavior at Dhamki Pre Release Event
Author
First Published Mar 18, 2023, 1:15 PM IST


స్టార్స్ అంటే ఫ్యాన్స్ కు ప్రాణం, ఫ్యాన్స్ అంటే కూడా స్టార్స్ చాలా అభిమానం చూపిస్తుంటారు. కాని కాని లక్షల మంది ఫ్యాన్స్ లోకి వెళ్ళి.. వారితో మాట్లాడలేవరు కాబట్టి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. మీదపడి రచ్చ చేస్తారని భయంతో ఉంటారు. కొంత మంది ఫ్యాన్స్ చేసే పనులకు స్టార్ హీరోలు ఇబ్బందుల్లో పడుతుంటారు. చిరాకుపెట్టేవారికి దూరంగా ఉండటానికి గట్టిగా ప్రయత్నిస్తుంటారు. అయినా సరే ఒక్కోసారి ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు తప్పబు స్టార్ హీరోలకు. అలాంటి సందర్భాలు స్టార్ హీరోల కెరీర్ లో చాలా ఉంటాయి. అలాంటి సంఘటనే రీసెంట్ గా ఎన్టీఆర్ కు అనుభవంలోకి వచ్చింది. 

స్టార్ హీరోలు ఏదైన ఫంక్షన్ కో.. ఈవెంట్ లో వస్తే.. ఒకప్పుడు ఆటో గ్రాఫ్ కోసం పోటీపడేవారు. ఇప్పడు ఫోటోగ్రాఫ్ కోసం ఎగబడుతున్నారు. అంతే కాదు ఏదో ఒక రచ్చ చేసి ఇబ్బండిపెడుతుంటారు. సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉన్నా సరే.. దూసుకెళ్లి తమ అభిమాన హీరోలను కౌగిలించుకుని రచ్చ రచ్చ  చేస్తుంటారు. మహేష్, అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ ఇలాచాలామందికి ఇది అనుభవం అయినదే.. అందరూ చూసిందే.. కాని ఈసారి ఎన్టీఆర్  కు అంతకంటే ఎక్కువగా అనుభవంలోకి వచ్చిందిఓ అభిమాని వల్ల. అతను చేసిన పనికి.. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు తారక్. ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అయిపోయింది పరిస్థితి. 

ఆస్కార్ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇండియాకు వచ్చీ రాగానే బాగా బిజీ అయిపోయాడు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న తారక్ ను  ఓ అభిమాని భయపెట్టేశాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన దాస్ కా దమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిదిగా హాజరయ్యాడు. ఎన్టీఆర్. విశ్వక్ సేన్ హీరోగా నటించి ఈమూవీ ప్రిరిలీజ్ ఈవెంట్  శుక్రవారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో ఆస్కార్ గురించి, విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడాడు. స్పీచ్ తర్వాత స్టేజీ దిగుతుండగా.. సడన్ గా ఓ అభిమాని ఎన్టీఆర్ పైకి దూసుకొచ్చి పట్టేసుకున్నాడు. తారక్ ను పైకి లేపే ప్రయత్నం చేశాడు.  బౌన్సర్స్ వారించే ప్రయత్నం చేశారు గానీ తారక్ వద్దని చెప్పడంతో హగ్ చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ మాత్రమేకాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందడు  ఎన్టీఆర్. హాలీవుడ్ మేకర్స్ ప్రసంసలు కూడా పొందాడు. ఆస్కార్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పేరు మారుమొగింది. ఆస్కార్ఈవెంట్ గురించి జరిగిన ఓ సర్వేలో.. అక్కడ ఉన్నవారు ఎక్కువగా మాట్లాడుకున్న హీరోలలో ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు తెలిసింది. ఆతరువాత ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆస్కార్ అఫీషియల్ గా ఫాలో అవుతున్న ఇన్ స్టా గ్రామ్ స్టార్స్ లిస్ట్ లో ఇండియానుంచి ఇద్దరు హీరోలు మాత్రమే ఉండగా.. అందులో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కు ప్లేస్ దక్కింది. ఇక బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ ఆ లిస్ట్ లో ప్లేస్ సాధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios