యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి తన ఓపెన్‌ మైండ్‌ని చాటుకున్నారు. యాంకర్‌ సుమపై తన అభిప్రాయాన్ని కీరవాణికి ఓపెన్‌గా చెప్పాడు. కానీ ఆయన విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌(Ntr) అంటే బోల్డ్. భోళాశంకర్‌ లాంటివాడు. ఏదీ మనసులో పెట్టుకోడు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తాడు. చిన్న పిల్లాడి మనస్థత్వం, ఆయన ప్రేమని తట్టుకోవడం చాలా కష్టం అని రాజమౌళి పదే పదే చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) ప్రమోషన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు రాజమౌళి. అది నిజమే అనే విషయాన్ని ఎన్టీఆర్‌ కూడా చాలా సార్లు నిరూపించుకున్నారు. తాజాగా మరోసారి తన ఓపెన్‌ మైండ్‌ని చాటుకున్నారు. అయితే స్టార్‌ యాంకర్‌ సుమ(Anchor Suma)పై తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పాడు. కానీ ఆయన విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి `ఆర్‌ఆర్ఆర్‌` చిత్రంలో నటించారు. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది యూనిట్‌. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇండియాలోని ప్రధాన నగరాలను కవర్‌ చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో టీమ్‌ ఇంటర్వ్యూలు, చిట్‌చాట్‌లోనూ పాల్గొన్నారు. ఒక్కొక్కటి విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆడియెన్స్ ని తన సినిమాపై ఎంగేజ్‌ చేస్తున్నారు. 

అందులో భాగంగా తాజాగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి చిట్‌చాట్‌ చేశారు. ఇందులో చరణ్‌, తారక్‌లను కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో కీరవాణి కంపోజ్‌ చేసిన పాటల్లో తనకు `భీమవరం బుల్లోడా `పాట తనకు అస్సలు నచ్చదని చెప్పాడు తారక్‌. తనకు ఇష్టమైన సింగర్‌ మోహన భోగరాజు, గీతా మాధురి ల పేర్లు చెప్పారు. వారి వాయిస్‌ బాగుంటుందన్నారు. ఇంతలో యాంకర్‌ సుమ గురించి చెప్పాలని, ఆమెకి మీ సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇస్తారని కీరవాణి ప్రశ్నించాడు. 

దీంతో ఎన్టీఆర్‌ స్పందించారు. సుమపై నోరు పారేసుకున్నాడు. ఆమె గయ్యాలి అని, నోరుపారేసుకుంటుందని, ఆమెని చూస్తే గయ్యాలి అత్త పాత్రలు గుర్తొస్తాయని, ఆయా పాత్రలు ఆమెకి బాగా సెట్‌ అవుతుందన్నారు. అంతేకాదు నాయనమ్మ, అమ్మమ్మ లాంటి ముసలమ్మ పాత్రలివ్వాలన్నాడు. అంతటితోనూ ఆగలేదు ఎన్టీఆర్‌, సుమకి చాదస్తం ఎక్కువని, ఎక్కువగా వాగుతుందని చెప్పారు. రామ్‌చరణ్‌ సైతం స్పందించారు. సుమకి పంజాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రని ఇవ్వాలన్నాడు. 

అయితే సరదాగా సాగిన చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌ ఫన్నీ వేలో ఈ విషయాలు చెప్పారు. కాసేపు నవ్వించడం కోసం ఇలా ఆమెపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమ నటిగా రీఎంట్రీ ఇస్తూ `జయమ్మ పంచాయితీ` చిత్రంలో నటిస్తుంది. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సుమ భర్త, నటుడు రాజీవ్‌ కనకాల, ఎన్టీఆర్‌ ఇద్దరు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం తారక్‌, చరణ్‌ అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా వెయిట్‌ చేస్తుండటం విశేషం.