టాలీవుడ్ లో సింహ పేరును బాగా వాడిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటనలో కూడా నట సింహం అని గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఈ మధ్య సైలెంట్ అయ్యారు. మెయిన్ గా మహానాయకుడు ఎఫెక్ట్ ఎంతగా పడిందో నిన్నటితో అభిమానులకు కూడా చాలా క్లారిటీ వచ్చింది. 

సాధారణంగా బాలకృష్ణ కెరీర్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఎన్టీఆర్ ను తలచుకోకుండా అభిమానుల ముందుకు రాని బాలకృష్ణ ఆయన బయోపిక్ ను టచ్ చేసి డిజాస్టర్ ఇవ్వడంతో చాలా బాధగా ఉంటుందనే చెప్పాలి. 118 ప్రీ రిలీజ్ వేడుకలో అసలు ఆయనలో మొన్నటివరకు ఉన్న జోష్ ఏ మాత్రం కనిపించలేదు. 

కళ్యాణ్ రామ్ బలవంత పెడితే వచ్చినట్లు ఉందని అర్ధమయిపోయింది. మెయిన్ గా టైటిల్ ను కాస్త 189 గా మార్చేయడంతో ఆయన ద్యాస అసలు వేడుకలో ఉందా లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రిష్ మీద నమ్మకంతో ఎన్టీఆర్ బయోపిక్ ను ఆడియెన్స్ కి ఎమోషన్ తో కనెక్ట్ చెయ్యాలని అనుకున్నారు. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన రిజల్ట్ ఇప్పుడు బాబు గ్యాంగ్ లో ఊహించని ఆందోళన రేకెత్తిచినట్లు టాక్ వస్తోంది. 

అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్లు..  బయ్యర్లకు భారీ నష్టాలు రావడం.  ఇన్ని ఆందోళనల మధ్య బాలకృష్ణ ఏ విధంగా జోష్ లోకి వస్తారు అనేది ట్రోల్ చేసేవారు కాస్త ఆలోచిస్తే బెటరేమో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సింహం చాలా సైలెంట్ అయిపొయింది. మరి గాయపడిన సింహం బౌన్స్ బ్యాక్ అయినట్టు బాలకృష్ణ కూడా నెక్స్ట్ సినిమాతో ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.