ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతికి భారీ కానుక ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్. ఈ నెల 18న లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి సీటీలో ఉన్న ఓ పెద్ద ఫామ్ హౌజ్‌ని ఆమె పేరిట రాయించాడు.
ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతికి భారీ కానుక ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్. ఈ నెల 18న లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి సీటీలో ఉన్న ఓ పెద్ద ఫామ్ హౌజ్‌ని ఆమె పేరిట రాయించాడు. అంతేకాదు ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అదే ఫామ్ హౌజ్‌లో నిర్వహించినట్టు తెలుస్తుంది. దీంతో ప్రణతి ఉబ్బితబ్బిబ్బయ్యిందట. ఊహించని గిఫ్ట్ కి ప్రణతి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ 2011 మే 5న ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అభయ్‌రామ్, భార్గవ్ రామ్‌లు జన్మించారు. ఇదిలా ఉంటే ఆదివారం ఆయన `తెల్లవారితే గురువారం` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అందులో అభిమానులు స్టేజ్‌పైకి దూసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేశారు. మరికొందరు సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆయన సీరియస్‌గా స్పందించారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తున్నారు.
