Asianet News TeluguAsianet News Telugu

NTR 30: రక్తం ఏరులైపారగా కెరటాలు ఎరుపెక్కాయి, ఎన్టీఆర్ వచ్చేశాడు!

ఎన్టీఆర్ 30 అప్డేట్ వచ్చేసింది. సినిమా కాన్సెప్ట్ ని తెలియజేసేలా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్ అదిరింది. 
 

ntr 30 motion poster rises expectations on movie
Author
Hyderabad, First Published May 19, 2022, 7:35 PM IST


ఎన్టీఆర్ బర్త్ డే (NTR Birthday)నేపథ్యంలో నేడు ఆయన తదుపరి చిత్ర అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన మోషన్ పోస్టర్ వీడియో అంతకు మించిన విజువల్స్ కలిగి ఉంది. ''అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూదని... అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని... వస్తున్నా'' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కల్గించేదిగా ఉంది. డైలాగ్ లో కొరటాల మార్క్ స్పష్టంగా కనిపించింది. 

అదే సమయంలో ఎన్టీఆర్ (NTR) ప్రీ లుక్ ఊర మాస్ గా ఉంది. సాగర తీరంలో ఎన్టీఆర్ శత్రువులను ఊచకోత కొస్తుండగా ఆ రక్తపు ధారలకు కెరటాలు ఎరుపెక్కాయి. దుర్మార్గుల అరాచకాలు ఎక్కువై సామాన్యుడి సహనం నశిస్తే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో.. చెప్పడమే ఈ సినిమా థీమ్ అన్నట్లు కొరటాల డైలాగ్ ద్వారా అర్థం అవుతుంది. మొత్తంగా 47 సెకెన్ల మోషన్ పోస్టర్ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. ఇక అనిరుధ్ బిజీఎం సరికొత్తగా, మరో ఆకర్షణగా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో నాలుగు భాషల్లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఎన్టీఆర్ 30 (NTR 30) హీరోయిన్ ఫైనల్ కాలేదు. అలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నేపథ్యంలో మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios