Asianet News TeluguAsianet News Telugu

'నెట్ ఫ్లిక్స్ 'లో బాలయ్య షో... అదొక్కటే సమస్య

బాలయ్యతో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఓ బిగ్ షో ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. 

 Now Netflix wants to start Nandamuri Balakrishna talk show
Author
First Published Jan 1, 2023, 10:47 AM IST


నందమూరి బాలకృష్ణ  హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఆహా ఓ.టి.టి. కి బాగానే వర్కౌట్ అయింది. రీసెంట్ గా  టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ హాజరైన అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ కు ఆహా ఓటీటీలో రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. టెక్నికల్ సమస్యతో స్ట్రీమింగ్ ఆగిపోయినా, ఆ తర్వాత పునరుద్ధరించారు. ఈ ఎపిసోడ్ 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ఈ ఎపిసోడ్ రికార్డు సృష్టించింది. దాంతో ఇప్పుడు మిగతా ఓటిటి ల దృష్టి ఈ షోపై పడంది.

ఇలాంటి షో తమ ఓటిటిలోనూ ఉంటే బాగుంటుదని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాలయ్య షో రన్ అవుతూండగా తాము చేస్తే క్లోన్ చేసినట్లుగా ఉంటుందని ఆగుతున్నారు. అయితే నెట్ ప్లిక్స్ మాత్రం ఓ అడుగు ముందుకు వేసిందని తెలుస్తోంది .బాలయ్యతో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఓ బిగ్ షో ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆడియెన్స్ పరంగా ఆహా కంటే ‘నెట్ ఫ్లిక్స్’కే ఎక్కువ కాబట్టి.. బాలయ్యతో షో అంటే ప్రపంచ దేశాలు చూసేలా ఉండబోతుందని అలా ప్లాన్ చేయాలని అంటున్నారు. 

అయితే ఇది వింటానికి గొప్ప ఆలోచనగా అనిపిస్తుంది కానీ.. అక్కడే ఓ మైనస్ ఉంది. తెలుగులో బాలయ్య కు పాపులారిటీ ఉండటంతో ఈ స్దాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీన్ని వరల్డ్ ఆడియన్స్  వద్దుకు తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇది నిజం అనిపించటం లేదు. ఇక ప్రభాస్ తో బాలకృష్ణ ఇంటర్వ్యూని రెండు భాగాలుగా రూపొందించారు. ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది మొదటి భాగమే. రెండో పార్టులో ప్రభాస్ కు గోపీచంద్ కూడా జతకలవనున్నారు. దాంతో ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏపిసోడ్ వచ్చే వారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక బాలకృష్ణ  హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని 'వీరసింహారెడ్డి' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలు మాస్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లాయి. పాటల గురించి చెప్పాలంటే ఫ్యాన్స్ కి ఇక పండగే. నాకు తెలిసి థియేటర్స్ లో ఎవరూ సీట్లలో కూర్చోరు. అంత బీభత్సంగా ఉంటాయి. జనవరి 12న వస్తున్నాం .. రెడీగా ఉండండి" అంటూ చెప్పుకొచ్చాడు.  శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. "జనవరి 12 నుంచి మామూలుగా ఉండదు. అన్ని థియేటర్స్ లో 'జై బాలయ్య' నినాదం మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఈ సాంగ్ లో సిగరెట్ స్టెప్ ఒకటి .. సోడా స్టెప్ ఒకటి ఉంటాయి. ఆ స్టెప్స్ మామూలుగా ఉండవు. 

Follow Us:
Download App:
  • android
  • ios