Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: నాటు నాటు సాంగ్ కి క్విక్ స్టైల్ వర్షన్... నార్వే దేశానికి పాకిన క్రేజ్!

ఆర్ ఆర్ ఆర్ సాంగ్ కి ప్రపంచమే డాన్స్ చేస్తుంది. ఈ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ఫేమ్ ఎల్లలు దాటేసింది. పలు దేశాల్లో నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. 

Norwegian dance group the quick style performs naatu naatu song video goes viral ksr
Author
First Published Mar 23, 2023, 10:48 AM IST

నాటు నాటు సాంగ్ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని బహుశా రాజమౌళి కూడా ఊహించలేదేమో. ఏకంగా ఆస్కార్ కైవసం చేసుకొని ఇండియన్ ఫ్లాగ్ ప్రపంచ సినిమా వేదికగా రెపరెపలాడేలా చేసింది. కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పర్ఫార్మన్స్ తెలుగు సినిమాకు ఆస్కార్ కట్టబెట్టాయి. అన్నింటికీ మించి రాజమౌళి విజన్ ఆస్కార్ కల నెరవేర్చింది. 

ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మన్స్ ఇచ్చే అరుదైన అవకాశం దక్కింది. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా డాన్సర్స్ ఆడారు. ఈ పరిణామంతో నాటు నాటు క్రేజ్ ప్రపంచ దేశాలకు పాకింది. సామాన్యులే కాకుండా ప్రముఖులు, దేశాల ప్రతినిధులు నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు. కొరియన్ ఎంబసీ ఎదుట అంబాసర్ తన స్టాఫ్ తో నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేశారు. 

అలాగే జర్మనీ స్టాఫ్ అదిరిపోయే పర్ఫార్మన్స్ ఇచ్చారు. ఢిల్లీలో గల జర్మన్ ఎంబసీ కార్యాలయం ఎదుట జర్మనీ అంబాసిడర్ తన ఉద్యోగులతో నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేశారు. ప్రొఫెషనల్ గా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. 

ఆర్సీ-15 సెట్స్ లో ప్రభుదేవా తన టీమ్ తో నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేయడం విశేషం. రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ లను ఆయన అభినందించారు. తాజాగా నాటు నాటు సాంగ్ కి నార్వే దేశానికి చెందిన ప్రముఖ డాన్స్ గ్రూప్ పర్ఫార్మ్ చేశారు. ది క్విక్ స్టైల్ డాన్స్ గ్రూప్ నాటు నాటు సాంగ్స్ కి తమదైన స్టెప్స్ క్రియేట్ చేశారు. తమ పెర్ఫార్మన్స్ కి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. మిలియన్స్ లో ఈ వీడియోని నెటిజెన్స్ వీక్షించారు. 

నాటు నాటు సాంగ్ కి క్విక్ స్టైల్ రీమిక్స్ అంటూ సదరు వీడియోకి కామెంట్ పెట్టారు. కాగా నాటు నాటు సాంగ్ క్రేజ్ ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. నాటు నాటు సాంగ్ ని ఉక్రెయిన్ దేశంలో నెలరోజుల పాటు షూట్ చేశారు. రెండు వారాలు ప్రాక్టీస్ చేసిన టీమ్... షూట్ చేయడానికి మరో రెండు వారాలు సమయం తీసుకున్నారు. ఒక్క పాట కోసం రాజమౌళి ఇంత సమయం కేటాయించారు. అది ఆయనకు ఆస్కార్ తెచ్చిపెట్టింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quick Style (@thequickstyle)

Follow Us:
Download App:
  • android
  • ios