ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ తక్కువ సమయంలో స్టార్ హోదా అందుకున్నాడు. ఇప్పుడు విజయ్ బాటలో అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'దొరసాని' అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానున్నాడు. 

ఇటీవల సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా టీజర్ లో ఆనంద్ దేవరకొండ లుక్స్, అతడి నటనపై కామెంట్స్ చేస్తున్నారు. రెండు విధాలుగా అతడు  మెప్పించలేకపోతున్నాడు.

మరి ఇండస్ట్రీలో ఎంతవరకు నిలదొక్కుకుంటాడనే సందేహాలు ఇప్పటినుండే కలుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ అయినా గట్టిగా చేస్తే ఆడియన్స్ సినిమాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ సపోర్ట్ తమ్ముడికి అవసరమనిపిస్తోంది. కానీ విజయ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.

మొన్నామధ్య ఆనంద్ దేవరకొండ ఎంట్రీ సంగతేంటని ప్రశ్నిస్తే తరువాత మాట్లాడుకుందామని స్కిప్ చేసేశాడు. ఇప్పుడు 'దొరసాని' సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వచ్చాయి. కానీ వీటిపై  విజయ్ దేవరకొండ స్పందించలేదు. కనీసం టీజర్ షేర్ చేసి తన ఫాలోవర్లకు చూపించాలని కూడా విజయ్ అనుకోలేదు. మరోపక్క తన స్నేహితుడు నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' ట్రైలర్ ని మాత్రం షేర్ చేసి తన ప్రేమ కురిపించాడు.

ఇండస్ట్రీలో నెపోటిజంని ప్రోత్సహించకూడదని విజయ్ ఇలా చేస్తున్నాడేమో కానీ ఇప్పుడు మాత్రం అతడి అవసరం ఆనంద్ దేవరకొండకి ఉందనే చెప్పాలి. మరి ఈ విషయంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!