టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ప్రభాస్, రానా ల పేర్లే వినపడతాయి. వీళ్లు ఎప్పుడు పెళ్లి వార్త చెబుతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. సడెన్ గా రానా.. తన ప్రేమ విషయం బయట పెట్టి  అందరినీ షాకింగ్ కి గురిచేశాడు.

అంతేకాదు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అందులో భాగంగా గత నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా.. మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌ 8న  వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. సురేష్ బాబు కూడా ఇదే విషయాన్ని కన్ఫ్మామ్ చేశారు.

అయితే.. రెండు రోజులుగా.. రానా పెళ్లి వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెళ్లి తేదీ ని మార్చారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన ఇరు కుటుంబాల పెద్ద‌లు రానా, మిహీక పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. రానా, మిహీక పెళ్లి ఆగ‌స్ట్ 8నే జ‌రుగుతుంద‌ని, పెళ్లి వాయిదా ప‌డుతుందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని వారు తెలిపారు.