Asianet News TeluguAsianet News Telugu

నిర్మాతలకు నితిన్ షాక్, ఇటలీలో యంగ్ హీరో చేసిన పనికి ఔరా అంటున్న ఇండస్ట్రీ

సినిమాలకోసం టైమ్ వేస్ట్ అవ్వకుండా సూపర్ ప్లాన్ వేశాడు యంగ్ హీరో నితిన్. ఒక్క దెబ్బకు రెండు సినిమాలు అన్నసామెతను ఫాలో అయ్యాడు. నితిన్ మాస్టర్ మైండ్ కు ఇండస్ట్రీ షాక్ అయ్యింది. నిర్మాతలు నివ్వెరపోయారట.
 

Nitin who covered the shootings of two movies in one trip
Author
Hyderabad, First Published May 19, 2022, 5:40 PM IST

వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తున్న నితిన్.. సక్సెస్ కోసం చేయగలిగిందంతా చేస్తున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. సూపర్ ఫాస్ట్ గా వాటిని కంప్లీట్ చేస్తున్నాడు. సినిమాలకోసం టైమ్ వేస్ట్ అవ్వకుండా సూపర్ ప్లాన్ వేశాడు యంగ్ హీరో. ఒక్క దెబ్బకు రెండు సినిమాలు అన్నసామెతను ఫాలో అయ్యాడు. 

నితిన్ తెలివితేటలకు నిజంగా హాట్సాఫ్ చెప్పలి. వరుసగా సినిమాలు చేస్తోన్న నితిన్. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చే హిట్ కోసం వెంపర్లాడుతున్నాడు హీరో. ప్రస్తుతం ఆయన నుంచి రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రిలీజ్ కు ముస్తాబు అవుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాతో పాటు.. మరో సినిమాకూడా సెట్స్ మీద ఉంది. 

నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాకి  రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ టచ్ తో కూడిన కథతో నడిచే డ్రామా ఈసినిమా. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ కంప్లీట్ అయ్యిది. మిగిలిన షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా  చేసేస్తున్నారు టీమ్. ఇక  ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా  కృతి శెట్టి నటిస్తోంది. 

ఈ సినిమాకి సంబధించిన 3 పాటలను  షూట్ చేయడానికి మూవీ టీమ్ రీసెంట్ గా ఇటలీ వెళ్లింది. అక్కడ పాటకి .. పాటకి మధ్య గ్యాప్ ఉండటంతో నితిన్ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ సమయాన్ని వృథా చేయకూడదని భావించిన నితిన్, తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ వక్కంతం వంశీని ఇటలీకి పిలిపించాడట.

ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న  శ్రీ లీలను కూడా ఇటలీకి రప్పించాడట.  వీళ్లతో పాటు కెమెరామెన్ .. కొరియోగ్రాఫర్ కూడా వెళ్లారని సమాచారం. అక్కడ ఉన్న టైమ్ ను యూస్ చేసుకుని నెక్ట్స్ సినిమా కోసం కూడా షూటింగ్ చేసుకోవాలని ప్లాన్ చేశాడట నితిన్. ఈసినిమాకు ఎలాగో నితినే ప్రొడ్యూసర్ కాబట్టి.. టైమ్ తో పాటు ఖర్చు కూడా కలిసోస్తుందని అలా ప్లాన్ చేసినట్టు టాలీవుడ్ టాక్. 

ఇక  నితిన్ -  శ్రీలీలపై ఒకటి రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒకే యూనిట్ తో రెండు సినిమాల పాటలను నితిన్ కవర్ చేశాడు నితిన్. నితిన్ ప్లానింగ్ పై టాలీవుడ్ లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రెండు సినిమాలు తన సోంత బ్యానర్ లోనే తెరకెక్కుతుండటంతో.. ప్రొడ్యూసర్ గా  నితిన్ ఆలోచనలకు హ్యాట్సాఫ్ చెపుతున్నారు నిర్మాలు. బాడ్జెట్ పై అతనికున్న గ్రిప్ కు షాక్ అవుతున్నారట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios