Asianet News TeluguAsianet News Telugu

శ్రీలీలపై నితిన్‌ కంప్లెయింట్స్.. షూటింగ్‌కి రావడమే పెద్ద ఛాలెంజ్‌ అంటూ బ్లాస్ట్..

నితిన్‌కి శ్రీలీలతో వర్కింగ్‌ ఎక్స్ పీరియెన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆమెతో వర్క్ చేయడంలో ఛాలెంజింగ్‌ పార్ట్ చెప్పాల్సిన రాగా.. ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 

nithin complaints on sreeleela regards dates and shooting arj
Author
First Published Dec 2, 2023, 5:11 PM IST

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల డేట్స్ కోసం అందరు హీరోలు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి. ఆమెకి ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఏక కాలంలో ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. దీంతో ఆమె డేట్స్ కోసం షూటింగ్‌లు వాయిదా వేసుకోవడం, అడ్జెస్ట్ చేసుకోవాల్సి వస్తుందట. తాజాగా నితిన్‌ కూడా అదే విషయాన్ని బయటపెట్టాడు. తన సినిమా ఈవెంట్‌లో బ్లాస్ట్ అయ్యాడు. 

తాను హీరోగా నటించిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీ సాంగ్‌ ఈవెంట్‌ని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నితిన్‌కి శ్రీలీలతో వర్కింగ్‌ ఎక్స్ పీరియెన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆమెతో వర్క్ చేయడంలో ఛాలెంజింగ్‌ పార్ట్ చెప్పాల్సిన రాగా.. ఆమె డేట్స్ ఇవ్వడమే పెద్ద ఛాలెంజ్‌ అని, ఆమె షూటింగ్‌కి రావడం, దానికి తగ్గట్టుగా షూటింగ్‌ అడ్జెస్ట్ చేయడమే తమకు పెద్ద సవాల్‌గా అనిపించిందని తెలిపారు నితిన్‌. 

ఒకవేళ శ్రీలీల డేట్స్ ఇస్తే.. ఆఫ్‌ డేనా, రెండు గంటలా, మూడు గంటలా అనేది ఓ ఛాలెంజ్‌ అయితే, ఆ సమయంలో ఆమె సీన్లు ఎలా తీయాలనేది దర్శకుడికి ఛాలెంజ్‌ అని, ఇప్పుడు ప్రమోషన్స్ కి రావాలి, రేపు వస్తుందట. ఆమె వస్తుందా? రాదా? రేపు వస్తుందా రాదా అనేది తమకు పెద్ద ఛాలెంజ్‌ అంటూ నవ్వుతూనే అసలు విజయాన్ని బయటపెట్టాడు నితిన్‌. అనుక్షణం ఆమెతో సవాళ్లని ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పారు. 

అంతేకాదు ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మొదట రష్మిక మందన్నా హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమెని తప్పించి శ్రీలీలని తీసుకుంటున్నారట. దీనిపై ఆయన స్పందిస్తూ, శ్రీలీలతో ఈ సినిమాతో మేం అనుభవించాం. వెంకీకి ఆ అనుభవం లేదు. ఆయన కూడా అనుభవిస్తాడు అంటూ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. 

ఇక శ్రీలీలతో కలిసి పనిచేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌ పీరియెన్స్ అని, ఆమె బాగా నటిస్తుందని, డాన్సులు చేస్తుందన్నారు. ఆమె స్పీడ్‌కి డాన్సులు చేసేందుకు తాను కూడా చాలా కష్టపడ్డానని, ఆమెని మ్యాచ్‌ చేసేందుకు బాగా వర్క్ చేయాల్సి వచ్చిందని, డాన్సులు చేయకపోతే, నితిన్‌ పని అపోయిందని అంతా అనుకుంటారు. ఆ భయంతోనే కష్టపడి డాన్సులు చేయాల్సి వచ్చిందన్నారు నితిన్‌. 

వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన `ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీ ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఇందులో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. రాజశేఖర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఇక సినిమాలో నితిన్‌ జూ ఆర్టిస్ట్ గా కనిపించబోతన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios