ఇటీవల విడుదలైన సార్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో చిత్రంపై అంచనాలు పెరిగాయి. విద్యా వ్యవస్థని ఎలా వ్యాపారంగా మార్చుతున్నారో అనే అంశాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన తాజా చిత్రం 'సార్'. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి చిత్రాలతో వెంకీ అట్లూరి మంచి గుర్తింపు పొందారు. ధనుష్ నే మెప్పించి ఆయనతో సినిమా చేయడం మామూలు విషయం కాదు. విలక్షణ నటనతో ధనుష్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సార్ చిత్రం విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండబోతోంది. 

ఇటీవల విడుదలైన సార్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనితో చిత్రంపై అంచనాలు పెరిగాయి. విద్యా వ్యవస్థని ఎలా వ్యాపారంగా మార్చుతున్నారో అనే అంశాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ధనుష్ తనదైన యాటిట్యూడ్, స్టైల్ తో అదరగొట్టేసినట్లు ఉన్నాడు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ధనుష్ స్ట్రైట్ గా చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో యంగ్ హీరో నితిన్ సార్ చిత్ర యూనిట్ కి విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. 'రేపటి నుంచి 'సార్' థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. ఆల్రెడీ చిత్రం గురించి గొప్ప విషయాలు తెలుస్తున్నాయి. డియర్ స్వామి వెంకీ అట్లూరికి కంగ్రాట్స్. ధనుష్ గారికి తెలుగులోకి గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నా. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ, చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ నితిన్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ నటించిన రంగ్ దే చిత్రం మంచి విజయం సాధించింది. ఆ విధంగా నితిన్, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక సార్ చిత్రంలో ధనుష్ కి జోడిగా భీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది.