Asianet News TeluguAsianet News Telugu

ExtraTrailer:నితిన్ 'ఎక్స్ట్రా' ట్రైలర్.. షర్మిల, జీవితా రాజశేఖర్ పై పేలిన పంచ్ లు..ఫుల్ ఎంటర్టైన్మెంట్

నితిన్, దర్శకుడు వక్కంతం వంశి ముందు నుంచి చెబుతున్నట్లు కంప్లీట్ ఎంటర్టైన్ మెంట్ తో ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ లో నితిన్ పేల్చుతున్న కామెడీ పంచ్ లు మామూలుగా లేవు. వైఎస్ షర్మిలపై సెటైర్ వేశారు. అంతే కాదు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న యాంగ్రీ హీరో రాజశేఖర్ సతీమణి జీవితపై కూడా ఫన్నీ సెటైర్ పేలింది. 

Nithiin Extra Ordinary Man Trailer out now dtr
Author
First Published Nov 27, 2023, 5:23 PM IST

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినప్పుడే మంచి బజ్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ లో నితిన్ క్యారెక్టర్ ఏంటి.. సినిమా ఎలా ఉండబోతోంది అనే క్లారిటీతో పాటు హైప్ కూడా పెరిగింది. 

డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నితిన్, దర్శకుడు వక్కంతం వంశి ముందు నుంచి చెబుతున్నట్లు కంప్లీట్ ఎంటర్టైన్ మెంట్ తో ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ లో నితిన్ పేల్చుతున్న కామెడీ పంచ్ లు మామూలుగా లేవు. వైఎస్ షర్మిలపై సెటైర్ వేశారు. అంతే కాదు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న యాంగ్రీ హీరో రాజశేఖర్ సతీమణి జీవితపై కూడా ఫన్నీ సెటైర్ పేలింది. 

ట్రైలర్ లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే కుర్రాడిలా కనిపిస్తున్నాడు. అది కూడా వెనుక వరుసలో నిలబడే ఎక్స్ట్రా గాడు అన్నమాట. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి అంటూ షర్మిల పొలిటికల్ డైలాగ్ పై సెటైర్ వేశారు. ఇక రావు రమేష్ తో వచ్చే తండ్రి కొడుకుల సన్నివేశాలు భలే సరదాగా ఉన్నాయి. 

అలా సాదాసీదాగా జూనియర్ ఆర్టిస్ట్ గా బతికేసే కుర్రాడు తన లైఫ్ లో మిరాకిల్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ మిరాకిల్ విలనే నా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒరిజినల్ గా నీకు నాకు గొడవ లేదు.. మరి ఇదేంటి అని అడగగా.. రష్యాకి ఉక్రెయిన్ కి గొడవ ఏంటి అని అడిగితే ఏం చెబుతాం సర్ అంటూ వచ్చే ఫన్నీ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. వక్కంతం వంశీ తన పెన్నుకు పదును పెట్టి మరీ కామెడీ పంచ్ లు దట్టించినట్లు ఉన్నారు. 

ఇక చివర్లో యాంగ్రీ హీరో రాజశేఖర్ ఎంట్రీ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను అని రాజశేఖర్ అంటే.. డౌట్ గా జీవితానా సర్ అని నితిన్ అడుగుతాడు. దీనికి జీవితం అని రాజశేఖర్ బదులివ్వడం.. జీవితం.. జీవిత నాకు రెండూ ఒక్కటే అని చెప్పడం భలే సరదాగా ఉంటుంది. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసేలా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios