Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ - అనుపమా ‘18 పేజెస్’ బస్ యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే!

నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ జంటగా రాబోతున్న చిత్రం ‘18 పేజెస్’(18 Pages). రెండ్రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ గ్యాప్ లో సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు యూనిట్ బస్ యాత్రను ప్రారంభించింది. 
 

Nikhil Anupamas 18 pages movie team bus trip through This route map!
Author
First Published Dec 20, 2022, 5:11 PM IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) - అనుపమా పరమేశ్వరన్ (Anupama) జంటగా రొమాంటిక్ డ్రామా ‘18 పేజెస్’ రాబోతోంది. వరుస హిట్ సినిమాలను రూపొందిస్తూ వస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిర్మాత బన్నీ వాసు నిర్మించగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్స్ వచ్చి ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రమోషన్నస్ ను కూడా జోరుగా చేస్తున్నారు. 

సినిమా విడుదలకు ఇంకా అయితే రెండ్రోజుల సమయం ఉండటంతో చిత్ర యూనిట్ బస్ యాత్రను షురూ చేసింది. ఈరోజే యాత్రను ప్రారంభి.. 18 సిటీల్లో సినిమాను ప్రమోట్ చేయబోతోంది. బస్ యాత్రకు ఏపీలోని వైజాగ్, గాజువాక, అనకాపల్లి, తుని, పిఠాపురం, కాకినాడ, మండాపేట, రాజమండ్రి ఏరియాలను రూట్ మ్యాప్ గా ఎంచుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా యాత్ర కొనసాగనుంది. రీసెంట్ గా చిత్ర నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలనే క్రియేట్ చేసింది. ఇక నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నూ గ్రాండ్ గా నిర్వహించారు. 

‘18 పేజేస్’ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. జీరో కట్స్ తో యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడదగిన సినిమాగా తేలిపోయింది. మరోవైపు సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ డీసెంట్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుండటంతో సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే అనుపమా - నిఖిల్ ‘కార్తీకేయ 2’తో  బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాతోనూ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios