Asianet News TeluguAsianet News Telugu

కరోనాకు బలైన టెలివిజన్ నటుడు

టెలివిజన్‌ రంగంలో వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెయిలీ సీరియల్స్‌కు సంబంధించిన లీడ్‌ యాక్టర్స్‌కు కరోనా సోకుతుండటంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. తాజాగా ఓ ఇంగ్లీష్‌ టీవీ స్టార్‌ కరోనా కారణంగా మృతి చెందాడు.

Nick Cordero dies from coronavirus
Author
Hyderabad, First Published Jul 6, 2020, 3:24 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ లాక్‌ డౌన్‌ నింబంధనలు సడలిస్తుండటంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు వినోదరంగంలో కూడా కార్యక్రమాలు ప్రారంభం కావటంతో సినీ, టెలివిజన్‌ నటులకు కూడా కరోనా సోకిన ఉదంతలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంటర్‌టైన్మెంట్‌ ఫీల్డ్‌లోనూ కరోనా మరణలు వెలుగు చూస్తున్నాయి.

ఇటీవల తెలుగు సినీ రంగంలో నిర్మాతగా ఉన్న పోకూరి రామారావు తుది శ్వాస విడిచారు. దీనికి తోడు టెలివిజన్‌ రంగంలో వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెయిలీ సీరియల్స్‌కు సంబంధించిన లీడ్‌ యాక్టర్స్‌కు కరోనా సోకుతుండటంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. తాజాగా ఓ ఇంగ్లీష్‌ టీవీ స్టార్‌ కరోనా కారణంగా మృతి చెందాడు. పలు అంతర్జాతీయ షోలో కీలక పాత్రల్లో నటించిన 41 ఏళ్ల నిక్‌ కార్డెరో లాస్‌ ఏంజిల్స్‌లో మృతి చెందాడు.

ఏప్రిల్‌లోనే నిక్‌కు కరోనా సోకినట్టుగా తెలియటంతో ఆయన్ను లాస్‌ ఏంజిల్స్‌ లోని సెడార్స్‌ సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 90 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న నిక్‌కు ఇటీవల కుడి కాలులో రక్తం గడ్డ కట్టడంతో కాలును తొలగించారు. తాజాగా పరిస్థితి విషమించటంతో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios