Asianet News TeluguAsianet News Telugu

బాబోయ్.. భానుశ్రీ వద్దు: నెటిజన్లు కామెంట్లు!

నటిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపికై తెచ్చుకుంది భానుశ్రీ. మొదట్లో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భాను.. కౌశల్ పై చేసిన కామెంట్స్ కారణంగా ఆడియన్స్ లో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. 

netizens comemnts on bhanu sri
Author
Hyderabad, First Published Sep 20, 2018, 5:14 PM IST

నటిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపికై తెచ్చుకుంది భానుశ్రీ. మొదట్లో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భాను.. కౌశల్ పై చేసిన కామెంట్స్ కారణంగా ఆడియన్స్ లో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు.

అలా ఎలిమినేట్ అయిన తరువాత ఆమె ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'ఢీ' షోలో టీమ్ లీడర్ గా కనిపించింది. ఇప్పటికే పది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 11వ ఎపిసోడ్ ని మొదలుపెట్టింది. మొదట ఎపిసోడ్ లోనే టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీ.. తన డైలాగ్స్ తో మరో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ ని ఆడేసుకుంది.

''నీ మీద పడి అరవడానికి రష్మిని కాదు.. నీ వెనుక పడి బ్రతిమిలాడటానికి వర్షిణిని కాదు.. భాను.. బాక్స్ బద్దలైపోద్ది'' అంటూ తనదైన డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ షో యూట్యూబ్ లో పెట్టిన కొద్ది గంటల్లోనే 11 లక్షల మంది వీక్షించారు.

నెటిజన్లు మాత్రం భాను గొంతుని వినలేకపోతున్నాం బాబోయ్.. ఆమెను తీసేసి రష్మిని పెట్టండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన భాను.. మీకు ఇష్టం లేకపోతే లైక్, కామెంట్ చేయొద్దని.. అంతేకాని ఇలా తన గొంతుపై విమర్శలు చేయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios