Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలో భారతీయుడు 2.. డేట్ అండ్ ఫ్లాట్ ఫార్మ్! 

కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆసక్తికర సమాచారం అందుతుంది. భారతీయుడు 2 ఏ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతుంది? డేట్ ఎప్పుడు? అనేది చూద్దాం.. 
 

Netflix grabs kamal haasan bharateeyudu 2 digital rights streaming would be ksr
Author
First Published Jul 12, 2024, 4:16 PM IST | Last Updated Jul 12, 2024, 4:16 PM IST

కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు 2 నేడు విడుదలైంది. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో వరల్డ్ వైడ్ అందుబాటులోకి వచ్చింది. 1996లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ భారతీయుడు చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారతీయుడు పార్ట్ 2 కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే భారతీయుడు 2 మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భారతీయుడు చిత్రానికి దరిదాపుల్లో కూడా పార్ట్ 2 లేదనే వాదన వినిపిస్తోంది. 

దానికి తోడు పార్ట్ 3 తెరకెక్కించాలనే ఆలోచనతో కథను అసంపూర్తిగా చెప్పారు. మూవీ కథనం పేలవంగా ఉంది. ఎమోషనల్ గా మూవీ కనెక్ట్ కాలేదని అంటున్నారు. భారతీయుడు 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహ, ఎస్ జే సూర్య కీలక రోల్స్ చేశారు. భారతీయుడు 2 చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి మైనస్ అంటున్నారు. 

కాగా భారతీయుడు డిజిటల్ రైట్స్ ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. విడుదలైన 6-8 వారాల్లో స్ట్రీమ్ అయ్యేలా ఒప్పందం జరిగిందట. నెగిటివ్ టాక్ నేపథ్యంలో నాలుగు వారాల్లోనే భారతీయుడు 2 ఓటీటీలో అందుబాటులోకి రావచ్చనే వాదన మొదలైంది. 

భారతీయుడు 2 నిర్మాణంలో అనేక వివాదాలు తలెత్తాయి. ఈ మూవీలో నటించిన వివేక్, మనో బాల అనారోగ్యంతో కన్నుమూశారు. భారతీయుడు 2 సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకోగా..  ఇద్దరు యువకులు మరణించారు. నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి వివాదాలు తలెత్తడంతో మూవీ ఆగిపోయింది. మరలా కాంప్రమైజ్ అయ్యారు. దానికి కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ సక్సెస్ కారణమైంది. 2019 జనవరిలో షూటింగ్ మొదలు కాగా ఐదేళ్లకు 2024లో విడుదలైంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios