Asianet News TeluguAsianet News Telugu

#Netflix వరల్డ్ వైడ్ గా 'నెట్‌ఫ్లిక్స్‌' సబ్‌స్క్రైబర్స్ ఎంత మందో తెలిసా?

వేరే ఓటీటీలతో పోలిస్తే ఎక్కువ ఫీజ్ ఉన్నా నెట్‌ఫ్లిక్స్ కి సబ్ స్క్రైబర్స్ పెరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే కేవలం కంటెంట్ ఎక్కువగా ఇవ్వడం, మంచి వరల్డ్ కంటెంట్ అందిస్తుండటంతోనే ప్రేక్షకులు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

Netflix gains 13M new global 4Q subscribers jsp
Author
First Published Jan 24, 2024, 3:06 PM IST


కోవిడ్  తర్వాత ప్రజల ఎంటర్ టైన్మెంట్ సెగ్మెంట్ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు మన దేశంలో  ఓటీటీలో ఎవడు చూస్తారు అనేలా అభిప్రాయముంటే కరోనా తర్వాత ఓటీటీలకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరెట్లు ఓటీటీలు బలపడిపోయాయి. ఓటీటీల మధ్య కూడా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొనడంతో ప్రేక్షకులకు బెస్ట్ వినోదం దక్కుతోంది. అలాగే ఓటీటీలో ఇక్కడ అక్కడా అని లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి మంచి కంటెంట్ ఉన్నా ప్రపంచంలోని అన్ని మూలాల నుండి మంచి ఆదరణ దక్కుతుంది. 

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు.  స్క్విడ్ గేమ్ వంటి వెబ్ సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ చరిత్రలో కొత్త రికార్డులను క్రియేట్ చేయగా దీనికి డబ్ చేసి దాదాపు అన్ని బాషలలో కూడా రిలీజ్ చేస్తే అంతే ఆదరణ దక్కించుకుంది. అంతెందుకు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా హక్కులను ఇప్పటికే కొనుగోలు చేసేసింది నెట్ ఫ్లిక్స్. అలా అమెజాన్ ప్రైమ్ కు పెద్ద షాక్ ఇచ్చింది. పెద్ద చిత్రాలన్నీ తన గుప్పిట్లో ఉంచుకుంది. ఇటీవలే నెట్ ఫిక్ల్స్.. తాము హక్కులను కొనుగోలు చేసిన సినిమాల జాబితాను ప్రకటించింది. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీలైన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్-1, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు.. ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి.  తాజాగా నెట్‌ఫ్లిక్స్ తమ సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ప్రకటించింది.

గతంలో 2023లో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ దాదాపు 240 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. తాజాగా 2023 చివరివరకు నెట్‌ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా 260 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. అంటే దాదాపు 26 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు నెట్‌ఫ్లిక్స్ కి. గత మూడు నెలల్లోనే 13 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ పెరిగారని తెలిపింది. వేరే ఓటీటీలతో పోలిస్తే ఎక్కువ ఫీజ్ ఉన్నా నెట్‌ఫ్లిక్స్ కి సబ్ స్క్రైబర్స్ పెరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే కేవలం కంటెంట్ ఎక్కువగా ఇవ్వడం, మంచి వరల్డ్ కంటెంట్ అందిస్తుండటంతోనే ప్రేక్షకులు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ మంచి లాభాల్లో నడుస్తోందని సమాచారం.

ఇక ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ సీఈవో బృందం.. హైదరాబాద్ వచ్చి తెలుగు స్టార్ హీరోలందరి ఇళ్లకు వెళ్లింది. వారితో ముచ్చటించి టిఫిన్లు, భోజనాలు చేసింది. ఆ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో అందుకే నెట్ ఫ్లిక్స్ టీమ్.. హైదరాబాద్ వచ్చి టాలీవుడ్ మేకర్స్ తో భారీ సినిమాల డీల్స్ కుదుర్చుకుందేమోనని నెటిజన్లు అంటున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios