కొన్ని సినిమాలు ట్రైలర్ చూసే చెప్పేయచ్చు. వాటిలో సత్తా ఉందని,తప్పకుండా చూడదగ్గ సినిమా అవుతుందని. అలాంటి సినిమాలుకు సోషల్ మీడియా బాగా సపోర్ట్ చేస్తుంది. తాజాగా ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ’ సినిమా బండి ‘ మే 14న నెట్ ప్లిక్స్  లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ట్రైలర్ పై సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ రిలీజైన రెండు రోజుల్లో అతి పెద్ద సినిమా అయ్యిపోయింది. 

 ‘లాంగ్‌ డ్రైవ్‌’, ‘వై మీ’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు చేరువైన దర్శకుడు ప్రవీణ్‌. ప్రస్తుతం ప్రవీణ్ దర్శకుడిగా ఫుల్ లెంగ్త్ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నకథతో ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘సినిమా బండి’. గ్రామంలో నివసించే ఓ వ్యక్తికి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని ‘సినిమా బండి’లో చూపించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రటీమ్ విడుదల చేసింది.

https://www.youtube.com/watch?v=vRzgLJMP4zc&t=23s

టౌన్‌లో నివసించే ఓ వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే, ఓ రోజు అతని ఆటోలో ఎవరో ప్రయాణికుడు కెమెరా మరిచిపోయి వెళ్లిపోతాడు. సినిమాపై ఉన్న మక్కువ వల్ల దొరికిన కెమెరా సాయంతో తన ఊరిలోనే ఉన్నవారిని పెట్టి సినిమా తెరకెక్కించే పనిలో పడతాడు. అదే సమయంలో కెమెరాని పోగొట్టుకున్నవాళ్లు దాని కోసం వెనక్కి వస్తే..? ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఆ వ్యక్తి సినిమా పూర్తి చేయగలిగాడా? అనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మే 14న ‘సినిమా బండి’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.