Asianet News TeluguAsianet News Telugu

చరణ్ మాటలపై సోషల్ మీడియాలో కామెంట్స్!

ఒక ఈవెంట్ కి అతిథిగా హాజరైనప్పుడు అక్కడున్న వారందరినీ పొగుడుతూ స్పీచ్ లు ఇవ్వడం కామన్. కొన్ని సార్లు గొప్ప వ్యక్తులతో పోలుస్తూ జాగ్రత్తగానే స్పీచ్ ని ముగిస్తుంటారు. 

negative comments on ram charan
Author
Hyderabad, First Published Dec 19, 2018, 10:48 AM IST

ఒక ఈవెంట్ కి అతిథిగా హాజరైనప్పుడు అక్కడున్న వారందరినీ పొగుడుతూ స్పీచ్ లు ఇవ్వడం కామన్. కొన్ని సార్లు గొప్ప వ్యక్తులతో పోలుస్తూ జాగ్రత్తగానే స్పీచ్ ని ముగిస్తుంటారు. తప్పుగా ఒక్క వాఖ్యం దొర్లినా అది వివాదాలకు దారి తీస్తుంటుంది.

తాజాగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 'అంతరిక్షం' ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన చరణ్.. తెలుగు ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో కూడిన దర్శకుడు రాజమౌళి, సుకుమార్, క్రిష్ అని అన్నాడు. అలాంటి కోవలోకే అంతరిక్షం డైరెక్టర్ సంకల్ప్ రావాలని కోరుకున్నాడు.

అక్కడ వరకు ఓకే కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో ఉన్నది ఈ ముగ్గురు దర్శకులేనా..? అనే ప్రశ్నలు  తలెత్తుతున్నాయి. పోనీ పాత తరం దర్శకులు చరణ్ కి గుర్తులేకపోయినా.. ప్రస్తుతం ఉన్న దర్శకుల గురించి మాట్లాడాలన్నా చాలా మంది ఉన్నారు. 

వారందరినీ వదిలేసి గొప్ప ఆలోచనలున్న దర్శకులు అనే ట్యాగ్ ని ముగ్గురికి మాత్రమే పరిమితం చేయడం వెనుక చరణ్ ఆంతర్యమేమిటో..? సోషల్ మీడియాలో మాత్రం చరణ్ విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. చరణ్ తనతో సినిమా చేసిన దర్శకుల పేర్లు, అలానే సినిమా చేయాలనుకుంటున్న దర్శకుల పేర్లు చెప్పి ఊరుకున్నాడంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios