Asianet News TeluguAsianet News Telugu

క్రేజ్ తెచ్చిందే తెలుగు సినిమా.. మర్చిపోయావా ప్రభాస్..?

'బాహుబలి' సినిమా ప్రభాస్ కి ఎంతటి క్రేజ్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

negative comments on prabhas
Author
Hyderabad, First Published Jul 8, 2019, 4:20 PM IST

'బాహుబలి' సినిమా ప్రభాస్ కి ఎంతటి క్రేజ్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు పెరిగారు. బాలీవుడ్ లో కూడా అతడికి మార్కెట్ ఏర్పడింది. అయితే అక్కడ స్టార్ హీరోల మాదిరి ప్రభాస్ కి అంత క్రేజ్ లేదు.

బాలీవుడ్ తో పోల్చుకుంటే ప్రభాస్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మార్కెట్ రేంజ్ కూడా ఎక్కువే.. అతడు నటిస్తోన్న 'సాహో' హిందీ హక్కులు యాభై కోట్ల రేంజ్ లో పలికితే తెలుగు హక్కులు అంతకు మూడు రెట్లు ఎక్కువ పలుకుతున్నాయి.అయినప్పటికీ ప్రభాస్ హిందీ మార్కెట్ మీదే ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు.

'సాహో' సినిమాలో హీరోయిన్ దగ్గరనుండి కీలక పాత్రలకి హిందీ వాళ్లను తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రధానంగా తెలుగు హీరోతో తెలుగు సినిమా తీస్తూ హిందీ మార్కెట్ కి తగిన పాటలు చేయించడం, హిందీలో పాటను షూటింగ్ చేసి తెలుగులో అనువదించడం ఏంటో..? 'సాహో'లో మొదటి పాట విడుదలైన క్రమంలో ప్రభాస్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.

తెలుగువారి అభిరుచికి తగ్గట్లుగా పాట చేయించడం ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్  పెడుతున్నారు. ప్రభాస్ కి క్రేజ్ తెచ్చిందే.. తెలుగు సినిమా అని అలాంటిది ఇప్పుడు తెలుగునే చిన్న చూపు చూస్తున్నాడంటూ మండిపడుతున్నారు. అయితే అటు ప్రభాస్ కానీ, యువి క్రియేషన్స్ కానీ హిందీ మార్కెట్ కోసమే వెంపర్లాడుతున్నారనే విషయం ఈ పాటతో నిరూపించారు. సినిమా హిట్ అయితే ఈ విషయాలేవీ పెద్దగా కన్సిడర్ చేయరు కానీ తేడా జరిగితే మాత్రం అంతే..  

Follow Us:
Download App:
  • android
  • ios