బాలయ్య లేటెస్ట్ మూవీలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. నేడు ఆమె చిత్ర షూట్లో జాయిన్ అయ్యారట. యూనిట్ ఆమెకు ఘన స్వాగతం పలికారు.  

నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ ఒక్కసారిగా స్వింగ్ లోకి వచ్చింది. వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడ్డ ఆయన సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు ఆయనకు మరపురాని విజయాలు అందించాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మూవీతో హ్యాట్రిక్ మీద కన్నేశారు. బాలయ్య 108వ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ కాజల్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు సెట్స్ లోకి ఘనస్వాగతం పలికారు. 

కెరీర్లో మొదటిసారి బాలయ్యతో కాజల్ జతకడుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై హైప్ ఏర్పడింది. కాజల్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ఆమె కూడా లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. బాలయ్య, కాజల్, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు సమాచారం. బాలయ్య మూవీలో శ్రీలీల రోల్ ఏంటనేది సస్పెన్సు. బాలయ్య కూతురు పాత్ర అంటూ ప్రచారం జరిగింది. యూనిట్ ఖండించారు. 

Scroll to load tweet…

ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర నేపథ్యం మీద ఒక హింట్ ఇచ్చారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని చెప్పారు. బాలయ్యను సరికొత్త లుక్ లో ప్రజెంట్ చేస్తారట. ఆయన పాత్ర కూడా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలియజేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు.