పెళ్ళై నెలలు కూడానా గడవకముందే నయన్ , విగ్నేష్ జంట ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం రోజు నయన్, విగ్నేష్ జంట తమకి కవల పిల్లలు జన్మించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు. నయనతార సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా, విగ్నేష్ శివన్ ప్రతిభగల దర్శకుడిగా కొనసాగుతున్నారు. 

పెళ్ళై నెలలు కూడానా గడవకముందే నయన్ , విగ్నేష్ జంట ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో కొందరు అభిమానులు స్వీట్ షాక్ కి గురైతే , మరికొందరు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆదివారం రోజు నయన్, విగ్నేష్ జంట తమకి కవల పిల్లలు జన్మించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నయన్ విగ్నేష్ జంటకి కవలలుగా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 

వీరికి నయన్ విగ్నేష్ జంట ఉయిర్, ఉలగన్ అని నామకరణం కూడా చేశారు. అయితే నయనతార సరోగసి విధానం వివాదంగా మారుతోంది. సరోగసి ద్వారా పిల్లలు పొందిన వారిలో నయన్ , విగ్నేష్ జంట మొదటి వారు కాదు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలు అంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు.

కానీ నయన్ పెళ్ళైన నాలుగు నెలలకే ఇలా సరొగసీని అనుసరించడం వివాదంగా మారుతోంది. నటి కస్తూరి లాంటి వాళ్ళు ఇండియాలో సరోగసి బ్యాన్ లో ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా అనివార్యం అయితే తప్ప సరొగసీని అనుసరించకూడదు అని చెబుతున్నారు. 

ఈ వివాదం ముదురుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. నయనతార, విగ్నేష్ శివన్ ల సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా అనే విషయంలో ఆరోగ్య శాఖ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్.. సరోగసిపై ప్రభుత్వానికి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ వివాదంపై నయన్, విగ్నేష్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.