'జాతి రత్నం' నవీన్ కు అదిరిపోయే ఆఫర్

ఈమద్య కాలంలో జెన్యూన్ గా పెద్ద హిట్ ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.ఫుల్‌ లెంగ్త్‌ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు టీమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ సినిమా డైరక్టర్ కు,  అందులో నటించిన ఆర్టిస్ట్ లకు,హీరో,హీరోయిన్స్ కు అందరికీ వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే  సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మస్త్‌ బిజీ అయ్యారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హిట్ అయినా రాని పేరు.. జాతి రత్నాలతో  వచ్చేసింది. దాంతో నవీన్ రెమ్యునేషన్ కు కూడా రెక్కలు వచ్చాయి.

Naveen Polishetty get super offer from harika and hasini banner jsp

ఈమద్య కాలంలో జెన్యూన్ గా పెద్ద హిట్ ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు.ఫుల్‌ లెంగ్త్‌ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు టీమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ సినిమా డైరక్టర్ కు,  అందులో నటించిన ఆర్టిస్ట్ లకు,హీరో,హీరోయిన్స్ కు అందరికీ వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే  సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మస్త్‌ బిజీ అయ్యారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హిట్ అయినా రాని పేరు.. జాతి రత్నాలతో  వచ్చేసింది. దాంతో నవీన్ రెమ్యునేషన్ కు కూడా రెక్కలు వచ్చాయి.

తెలుగులో పెద్ద బ్యానర్స్ అన్నీ నవీన్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకునే పనిలో ఉన్నాయి. అలాంటి వాటిలో హారిక అండ్ హాసిని బ్యానర్ వారి నవీన్ ని పోలిశెట్టిని ఏకంగా 5 కోట్ల పారితోషకాని లాక్ చేసేశారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి కి ఇప్పుడు 2.50 కోట్ల అడ్వాన్ ఇచ్చి.. మరి మిగిలింది, సినిమా రిలీజ్ అయ్యాక ఇచ్చేలా ఎగ్రిమెంట్  కూడా చేసేసుకున్నారని చెప్పుకుంటున్నారు. డైరక్టర్, కథ ఇంకా ఫైనలైజ్ కాలేదట. వారి దగ్గర ఉన్న ఓ మళయాళ రీమేక్ కావచ్చు అని వినపడుతోంది.  

మరో ప్రక్క హారిక & హాసిని బ్యానర్ కన్నా ముందే యువీ నిర్మాతలతో నవీన్ పోలిశెట్టికి ఒప్పందం అయ్యింది. అనుష్క హీరోయిన్ గా మొదలు కాబోతున్న ఈ మూవీకి నవీన్ 4 కోట్ల రెమ్యునేషన్  అందుకోబోతున్నాడట. 

ఇవన్నీ కాకుండా నవీన్ పొలిశెట్టి ని హీరోగా పెట్టి ఒక సినిమాను మహేష్ బాబు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. వీర శేఖర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.  

ఇక జాతిరత్నాలలో  చేసిన కమెడియన్స్‌ ప్రియదర్శి మరియు రాహుల్‌ రామకృష్ణ లు కూడా ప్రస్తుతం మోస్ట్‌ బిజీ కమెడియన్స్ గా టర్న్ అయ్యిపోయారు. మరి హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా రవితేజ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios