Asianet News TeluguAsianet News Telugu

అల్లు అరవింద్ అంత ఇచ్చారా.. నమ్మలేం!

సినిమా హాళ్లు ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడకపోవటంతో  చిన్న నిర్మాతలంతా ఓటీటీ వైపు ఆశ‌గా చూస్తున్నారు. వాళ్లు కూడా మంచి రేట్ల‌కే సినిమాల్ని కొన‌డానికి ముందుకు రావ‌డంతో, చిన్న సినిమాలు ఓటీటీ వైపుగా ట‌ర్న్ తీసుకుంటున్నాయి. అందులో భాగంగా మ‌రో సినిమా ఓటీటీ పంచ‌న చేరింది. 

Naveen Chandra Bhanumati Ramakrishna get 1.5 Crores
Author
Hyderabad, First Published Jun 15, 2020, 9:16 AM IST

ప్రతీవిషయంలో ఓ లెక్కగా వెళ్తూంటారు అల్లు అరవింద్. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో..ఎక్కడ పొదుపు చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు. అయితే కొంతకాలం క్రితం లాంచ్ చేసిన ఆహా యాప్ మాత్రం ఆయన అంచనాలకు అతీతంగా ముందుకు వెళ్తోంది. ఈ యాప్ అనుకున్న స్దాయిలో క్లిక్ కాలేదు. గీతా ఆర్ట్స్ , మెగా కుటుంబం అండతో వచ్చే ఈ యాప్ భారీ స్దాయిలో క్లిక్ అవుతుందని అందరూ భావించారు. అయితే సరైన కంటెంట్ లేక కూలబడింది. ఈ నేపధ్యంలో ఈ యాప్ ని లేపటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కొత్త సినిమాలు కొంటున్నారు. అలాగని అల్లు అరవింద్ ఎక్కువ రేటు పెట్టి సినిమాలు కొంటారా..అలా కంగారుపడే బిజినెస్ మ్యాన్ కాదు ఆయన. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే...

అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమ కి పరిచయం అయిన హీరో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న భానుమతి రామక్రిష్ణ ఓటీటి రిలీజ్ కానుంది.  ‘భానుమతి రామకృష్ణ’ అనే సినిమాను ఆహా యాప్ కు అమ్మేశారు. త్వరలోనే ఇది ఆ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కానుంది. అంటే ఆన్ లైన్ లో ఇంటి దగ్గరే చూసుకోవచ్చు.  ఈ నెలాఖ‌రు నుంచి ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతారు.  దాదాపు 1.5 కోట్ల‌కు ‘ఆహా’  హ‌క్కుల్ని కొనుగోలు చేసిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అరవింద్ ..ఓ క్రేజ్ లేని హీరో నటించిన సినిమా పై అంత పెట్టుబడి పెడతారా అని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. కావాలని ఇది పీఆర్వో ల ద్వారా ఈ సినిమాపై క్రేజ్ తేవటానికి చేస్తున్న ప్రచారం అంటున్నారు. 

సలోనీ లుత్రా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఆహా యాజమాన్యానికి చూపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు.   మరికొద్ది రోజుల్లో ఈ సినిమాని ఆహా లో చూడబోతున్నాం అని అంటున్నారు. అమృతరామమ్ తర్వాత డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రం ఇదే కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios