స్టార్  హీరోయిన్ గా రెండు దశాబ్దాలు టాలీవుడ్ ని ఏలింది సౌందర్య. కర్ణాటకు చెందిన సౌందర్యను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. సౌందర్యను చాలా మంది తెలుగు అమ్మాయిగా భావించే వారు. స్టార్ హీరోలకు సమానమైన స్టార్ డమ్ అనుభవించిన సౌందర్య టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ సరసన సౌందర్య అనేక చిత్రాలు చేయడం జరిగింది. విక్టరీ వెంకటేష్ తో సౌందర్య పలు హిట్ చిత్రాలలో నటించారు. వీరిది హిట్ ఫెయిర్ గా టాలీవుడ్ గుర్తించింది. 

అలాంటి సౌందర్య అర్థాంతంగా తనువు చాలించారు. 2004లో బీజేపీ పార్టీలో చేరిన ఆమె ఎన్నికల ప్రచారం కోసం వెళుతుండగా ఎయిర్ క్రాష్ కావడంతో మరణించడం జరిగింది. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన శివ శంకర్ మూవీలో సౌందర్య నటించగా అదే ఆమెకు చివరి చిత్రం. అలాగే బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల మూవీ ప్రారంభించడం జరిగింది. ఆ పౌరాణిక గాథలో సౌందర్య ద్రౌపది పాత్ర చేయడం జరిగింది. సౌందర్య మరణంతో ఆ ప్రాజెక్ట్ బాలయ్య నిలిపివేశారు. 

16ఏళ్ల క్రితం ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన 17 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలు విడుదల చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ చిత్రంలో ద్రౌపది పాత్ర చేసిన సౌందర్యను ప్రేక్షకులు వెండితెరపై చూడనున్నారు. ద్రౌపదిగా సౌందర్య లుక్ చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆమె అబ్బుర పరిచింది. ఇన్నేళ్ల తరువాత ఓ పౌరాణిక పాత్రలో సౌందర్యను చూసిన ఆమె  ఫ్యాన్స్  ఉద్వేగానికి లోనవుతున్నారు. మహాభారతంలో కీలకమైన ద్రౌపది పాత్రను ఆమె ఎలా చేయనుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.