నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు.

నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. విభేదాల కారణంగా తన మూడవ భార్య రమ్య రఘుపతికి నరేష్ దూరం అయ్యారు. అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. 

పెళ్లి చేసుకోకపోయినా వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే రమ్య రఘుపతితో నరేష్ ఇంకా అధికారికంగా విడాకులు పొందలేదు. ఈ నేపథ్యంలోనే నరేష్ పవిత్ర వివాహం వాయిదా పడుతోంది అనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇటీవల నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నట్లు వీడియో వైరల్ అయింది. 

ఆ తర్వాత అది సినిమా కోసం అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు నరేష్ పవిత్ర కి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ని ఫిలిం మేకర్స్ క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో నరేష్ , పవిత్ర మళ్ళి పెళ్లి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా నరేష్, పవిత్ర విహారయాత్రలతో లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఆధ్యాత్మిక సేవలో కూడా తరిస్తున్నారు. 

తాజాగా నరేష్.. పవిత్రని తన తల్లి విజయనిర్మల స్వగ్రామం అయిన ఏలూరు పాడుకి తీసుకుని వెళ్లారు. ఏలూరుపాడు గ్రామం పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. విజయనిర్మల సొంత ఊరు ఇదే. అక్కడ బంధువుల ఫంక్షన్ లో వీరిద్దరూ వెళ్లారు. అనంతరం నరేష్ పవిత్ర స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేత్కర్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయుల విగ్రహాలకు నరేష్, పవిత్ర నివాళులు అర్పించారు. 

గత ఏడాది నుంచి నరేష్, రమ్య రఘుపతి వివాదం తీవ్రంగా మారుతోంది. పవిత్రతో నరేష్ పెళ్లి జరగనివ్వను అని కూడా రమ్య శపథం చేశారు. ఈ నేపథ్యంలో రమ్య నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకే తమ పెళ్లి మ్యాటర్ ని సినిమా అంటూ కవర్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.