టీఎన్‌ఆర్‌ మరణం తెలుగు సినీ జర్నలిస్ట్ లోకానికి, తెలుగు సినిమాకి తీరని లోటని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరోలు నాని, విజయ్‌ దేవరకొండ, మంచు విష్ణు, సందీప్‌ కిషన్‌, నవీన్‌ పొలిశెట్టి వంటి వారు సంతాపం తెలిపారు.

ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనా మహమ్మారితో పోరాడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆయన మరణం తెలుగు సినీ జర్నలిస్ట్ లోకానికి, తెలుగు సినిమాకి తీరని లోటని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరో మంచు విష్ణు సంతాపం తెలిపారు. `టీఎన్‌ఆర్‌ హఠాన్మరణం తీరని లోటు. ఏడాది కిత్రం ఆయనతో నా బెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. వారి ఫ్యామిలీ మెంబర్‌కి నా సానుభూతి` అని తెలిపారు. 

Scroll to load tweet…

నాని స్పందిస్తూ, `టీఎన్‌ఆర్‌ గారు కన్నుమూశారనే వార్తతో షాక్కి గురయ్యాను. ఆయన ఇంటర్వ్యూలు కొన్ని చూశాను. గెస్ట్ నుంచి మంచి విషయాలను వారి హృదయాల నుంచి రాబట్టేవారు` అని తెలిపారు. నవీన్‌ పొలిశెట్టి చెబుతూ, `టీఎన్‌ఆర్‌ మరణం నన్నుతీవ్రంగా కలచి వేస్తుంది` అంటూ సంతాపం ప్రకటించారు. 

Scroll to load tweet…

`మీతో జరిగిన రెండు సుదీర్ఘ సంభాషణలను గుర్తొస్తున్నాయి. నిజమైన ప్రేమ, ఆసక్తి, సహనం గుర్తుకొస్తున్నాయి. మీ మరణం మా ఇంట్లో అందరిని కదిలించింది. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం సర్‌` అని విజయ్‌ దేవరకొండ తెలిపారు. వీరితోపాటు దర్శకుడు బాబీ, హీరో నాగశౌర్య, సంపత్‌ నంది, ఆది, అనన్య నాగళ్ల, సందీప్‌ కిషన్‌, మహేష్‌ కోనేరు, కోన వెంకటేష్‌, మంచు మనోజ్‌ వంటి వారు సంతాపం తెలిపారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…