హీరోగా వరస హిట్స్ తో దూసుకుపోతున్న నాని  2014లో 'డీ ఫర్ దోపిడీ' అనే చిత్రంతో  నిర్మాతగా మారారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ!' అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే  ఈసారి నిర్మాతగా నాని విజయాన్ని అందుకున్నాడు.  దాంతో అదే ఊపులో నాని ఇప్పుడు రెండు సినిమాలు నిర్మించబోతున్నట్లు సమాచారం.

తనని అష్టా చెమ్మ చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందించే చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా కమిటయ్యారు. అలాగే తనకు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన భలే భలే మొగాడివోయ్ చిత్ర దర్శకుడు మారుతి కోసం పూర్తి స్దాయి నిర్మాతగా మారుతున్నట్లు సమాచారం.

అయితే మారుతి తో చేయబోయే చిత్రం 35 వరకూ బడ్జెట్ ఉండబోతోందని వినికిడి. అయితే ఇంత బడ్జెట్ పెట్టి నాని నిర్మించుకోవాల్సిన అవసరం ఏమిటి అని చాలా మంది వెనక్కి లాగబోయారట. కానీ సబ్జెక్టు మీద నమ్మకం, తమ కాంబో కు వచ్చే క్రేజ్ ని నమ్మే ముందుకు వెళ్తున్నాడట నాని. 

శైలజా రెడ్డి చిత్రంతో మారుతి డిజాస్టర్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. కథలు వినే హీరోలు కనపడుతున్నారు కానీ ఓకే చేసి ప్రాజెక్టు పట్టాలు ఎక్కించేవారు మాయమయ్యారు. ఈ నేఫధ్యంలో నాని చొరవ చేసి కథను ఓకే చేసి తను నిర్మాతగా నిర్మించటం గొప్ప విషయం అంటున్నారు. అయితే అదే సమయంలో నాని పెద్ద రిస్క్ చేస్తున్నాడంటున్నారు. చిన్న సినిమాలు నిర్మిస్తే నష్టపోయినా పెద్దగా పోయేదేమీ ఉండదు. కానీ అంత పెద్ద మొత్తం అంటే ఆలోచించాలి కదా నాని.