Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ ఆర్మీ ఏం చేసినా.. నాని క్రేజ్ మాత్రం తగ్గదు!

టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానించే హీరో నేచురల్ స్టార్ నాని. తన సహజ నటనతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్ ని షేక్ చేశాడు. తనకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉన్నా.. ఒదిగుంటూ అందరి మనసులను గెలుచుకున్నాడు. 

Nani's detractors are like passing clouds
Author
Hyderabad, First Published Sep 21, 2018, 5:10 PM IST

టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానించే హీరో నేచురల్ స్టార్ నాని. తన సహజ నటనతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్ ని షేక్ చేశాడు. తనకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉన్నా.. ఒదిగుంటూ అందరి మనసులను గెలుచుకున్నాడు. అలాంటి నానిని టార్గెట్ చేస్తూ కౌశల్ ఆర్మీ చేసే కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

హౌస్ లో అందరినీ ప్రశ్నించినట్లే కౌశల్ ని కూడా ప్రశ్నిస్తున్నాడు. కానీ కౌశల్ ఆర్మీకి మాత్రం అది నచ్చడం లేదు. హౌస్ లో ఉన్న కొందరితో నానికి వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. దీంతో అతడు పక్షపాతం చూపిస్తున్నాడని, తనకు కావాల్సిన వాళ్లని విజేతగా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతవారంలో నాని డైరెక్ట్ గానే హౌస్ మేట్స్ లో మీలో ఎవరు గెలించినా.. నాకు ఒకటే.. ఒకరు గెలవడం వలన నాకు వచ్చేదేమీ లేదన్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

నిజమే.. రెమ్యునరేషన్ తీసుకొని హోస్ట్ చేయడం మాత్రమే నాని బాధ్యత. బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చెప్తే అది చేయాల్సిన బాధ్యత నానికి ఉంది. కానీ బిగ్ బాస్ కనిపించడు కాబట్టి కనిపిస్తోన్న నానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై వస్తోన్న నెగెటివిటీ గురించి నానికి కూడా తెలుసు.. కానీ ఈ విషయంలో అతడు చాలా సహనంతో ఉంటున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ షో పూర్తి కానుంది. కౌశల్ కూడా షో పూర్తయిన తరువాత తన పనుల్లో బిజీ అవుతాడు. అప్పుడు కౌశల్ ఆర్మీకి పెద్దగా పనుండదు.

కాబట్టి వారు టెంపరరీగా చేసే పనుల కారణంగా బాధ పడాల్సిన అవసరం లేదంటూ నాని సన్నిహితులు అతడికి చెబుతున్నారు. ఇక ఎప్పటిలానే నాని తన సినిమాలతో, షూటింగులతో బిజీ అయిపోతాడు. తన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తే అతడికి ఆడియన్స్ లో క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆ కారణంగానే నాని ఈ విషయాలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. నిన్న జరిగిన దేవదాస్ సినిమా ఫంక్షన్ లో కూడా నాని, యాంకర్ సుమ ఈ నెగెటివిటీపై ఫన్నీ కామెంట్స్ చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios