Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ పై కామెంట్స్, దాన్ని కూడా వివాదం చేశారు.. ఆవేదన వ్యక్తం చేసిన నాని, ఏమన్నాడంటే

నాని నటిస్తున్న 'దసరా' చిత్ర సందడి మొదలయింది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Nani response to  controversial comments on Sukumar
Author
First Published Mar 25, 2023, 1:41 PM IST

నాని నటిస్తున్న 'దసరా' చిత్ర సందడి మొదలయింది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  దసరా చిత్రం మార్చి 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నాని తన కెరీర్ లో తొలిసారి ఇలాంటి ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. దసరా చిత్రంపై నాని బోలెడు ఆశలే ఉన్నాయి. ప్రస్తుతం నాని దసరా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు.

ఇటీవల నాని చేస్తున్న కామెంట్స్ వివాదంగా మారుతూ వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వివాదం సుకుమార్, పుష్ప చిత్రం గురించి కూడా ఉంది. తాను ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా మాట్లాడినా కూడా వివాదం చేసేస్తున్నారు అని నాని ఆవేదన వ్యక్తం చేశారు. 

శ్యామ్ సింగరాయ్ సమయంలో టికెట్ ధరల గురించి క్యాజువల్ గా మాట్లాడాను. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో సుకుమార్ గారి గురించి పాజిటివ్ గా మాట్లాడాను. కానీ అందులో కూడా పెడర్థాలు తీసి నన్ను విమర్శిస్తున్నారు. చాలా మంది హీరోలు అగ్ర దర్శకులతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తుంటే మీరెందుకు కొత్త వారితో చేస్తున్నారు అని రిపోర్టర్ ప్రశ్నించారు. 

దీనిని నేను సమాధానం ఇస్తూ ఉదాహరణగా సుకుమార్ గారి గురించి చెప్పాను. సుకుమార్ గారు ఇక్కడ పాపులర్ డైరెక్టర్.. కానీ ఇతర ఇండస్ట్రీలకు ఆయన కొత్తవారేకదా.. పుష్ప చిత్రంతో ఆయన కొత్తగానే ఇతర ఇండస్ట్రీలకు వెళ్లారు. అక్కడ సుకుమార్ గారికి పుష్ప క్రేజ్ తీసుకువచ్చింది. దసరా దర్శకుడు కూడా కొత్తవాడే.. సినిమా రిలీజ్ తర్వాత పాపులర్ అవుతాడు అని నా అభిప్రాయం చెప్పా. దానిని కూడా వివాదం చేశారు అని నాని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios