Asianet News TeluguAsianet News Telugu

షార్ట్ ఫిల్మ్ మేకర్ తో నాని కొత్త చిత్రం!

దేవదాసు సినిమాతో పరవాలేదనిపించుకున్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ జెర్సీ అని సినిమాతో బిజీగా మారాడు. అందులో నాని ఒక క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ సినిమాతో పాటు రీసెంట్ గా ఒక కొత్త ప్రాజెక్ట్ కు ఈ కుర్ర హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

nani  accept another new movie
Author
Hyderabad, First Published Oct 16, 2018, 2:53 PM IST

దేవదాసు సినిమాతో పరవాలేదనిపించుకున్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ జెర్సీ అని సినిమాతో బిజీగా మారాడు. అందులో నాని ఒక క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ సినిమాతో పాటు రీసెంట్ గా ఒక కొత్త ప్రాజెక్ట్ కు ఈ కుర్ర హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. షార్ట్ ఫిల్మ్ మేకర్ చెప్పిన కాన్సెప్ట్ కి నాని ఫిదా అయ్యాడని తెలుస్తోంది. 

ప్రతి సినిమాకు నాని తన మార్కెట్ ను కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే నేను లోకల్ తరువాత మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కమర్షియల్ కథలతో కాకుండా డిఫరెంట్ గా ఉండే సినిమాలు ద్వారా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని నాని ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ అనే యువకుడిని నాని నమ్మినట్లు తెలుస్తోంది.   

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథ కామెడీ అండ్ సెంటిమెంట్ తో సాగుతుందని సమాచారం. నాని పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. త్వరలోనే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి నాని అధికారికంగా పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios