#Mokshagna: నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త, అక్కడే మోక్షజ్ఞ యాక్టింగ్ ట్రైనింగ్ !
ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనేది అభిమానులు అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మోక్షజ్ఞ.
నందమూరి బాలకృష్ణ (Balayya) కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు. గతంలో అనేకసార్లు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి వార్తలు నెట్టింట స్ప్రెడ్ అయ్యాయి. అలాగే లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఏదీ మెటీరియలైజ్ కాలేదు. మరో ప్రక్క ఈవెంట్స్‌లో మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై హీరోగా సెట్ అవుతాడా? అనే కామెంట్స్ కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. ఇక ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనేది అభిమానులు అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మోక్షజ్ఞ.
అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం వైజాగ్ సత్యానంద్ దగ్గర గత నవంబర్ నుంచి నట శిక్షణ తీసుకుంటున్నారు. మరో ప్రక్క బరువు తగ్గటం, ఫిజిక్ పై శ్రద్దపెట్టడం వంటివి చేసి కొత్త లుక్ లో కనపడేందుకు ప్రయత్నించబోతున్నారు. ఇక నటుడిగా కెరీర్ ప్రారంభించాలకునే వారికి కేర్ అఫ్ అడ్రెస్స్ వైజాగ్ సత్యానంద్ చిరంజీవి ఫామిలీ నుంచి వచ్చిన హీరోలకు, ప్రభాస్ కు, అలాగే , మన టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మందికి సత్యానంద్ నటనలో శిక్షణ ఇచ్చారు. ఎంతో మంది కొత్త పాత తరం వారికి గురువు ఆయన.
ఇక మోక్షజ్ఞ ఎప్పుడు తెరపై కనిపిస్తాడనే ప్రశ్నను బాలకృష్ణను అడిగితే అదిగో ఇదుగో అంటున్నారు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బోయపాటి శ్రీను సహా ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. మరి ఎవరు డైరెక్ట్ చేస్తారు? అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? నిర్మాతలు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం దాదాపు దొరికేసినట్లే .
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంది. బాలయ్య,బోయపాటి కాంబోలో ‘అఖండ 2’ సినిమా రాబోతుంది. ఇప్పటికే, బోయపాటి శ్రీను ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేశాడు. కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.ఖచ్చితంగా అఖండ 2లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది. ఈ వార్త విని నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇది అఫీషియల్ సమాచారం కాదు.