Asianet News TeluguAsianet News Telugu

నీహారికతో పెళ్లి.. నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు: నాగశౌర్య

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, నీహారిక పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

nagashourya on marriage rumours with niharika
Author
Hyderabad, First Published Jun 3, 2019, 9:44 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, నీహారిక పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి 'ఒక మనసు' సినిమాలో నటించారు. అప్పటినుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి.

అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాగశౌర్య సందర్భం వచ్చిన ప్రతీసారి  చెబుతూనే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రెండు రోజుల క్రితం నీహారిక తన ఇన్స్టాగ్రామ్ లో ఓ బాబుని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేసింది.

ఇద్దరిలో ఎవరు క్యూట్ గా ఉన్నారు..? అని ప్రశ్నించారు. దీనికి నాగశౌర్య.. 'ఇద్దరికీ దిష్టి తీయాలి' అని కామెంట్ చేశారు. దీంతో మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా నాగశౌర్య మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ప్రేమ లేదని చెప్పారు. 'నేను నీహారిక పెళ్లి చేసుకోబోతున్నామని తెగ వార్తలు రాస్తున్నారు.

కానీ మేం ప్రేమలో లేం.. అంతెందుకు నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి 'మీ కథేంటి..?' అని అడుగుతున్నారు. నేను షాక్ అయ్యా.. ఈ రూమర్స్ ఇంకెంతకాలం నడుస్తాయో.. దీనికి  ముగింపు ఎప్పుడు వస్తుందో చూడాలి' అంటూ చెప్పుకొచ్చింది. నీహారికతో మాత్రమే కాదు.. నేను ఏ హీరోయిన్ తోనూ రిలేషన్ లో లేను అంటూ తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios