Asianet News TeluguAsianet News Telugu

నెట్ ఫ్లిక్స్ తో నెగోషియోషన్స్.. నాగ్ ప్లాన్ ఏమిటో

 డీల్ కనుక ఫైనల్ అయితే నెట్ ప్లిక్స్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం  చూడాల్సిందే. 

Nagarjuna  Wild Dog opts for OTT release jsp
Author
Hyderabad, First Published Nov 26, 2020, 5:05 PM IST

నాగార్జున హీరోగా అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్‌ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ చిత్రం ఉంది.  కౌంటర్ టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో థియోటర్స్ లో రిలీజ్ చేసే పరిస్దితి కనపడటం లేదు. దాంతో ఓటీటిలో రిలీజ్ చేయటానికి ఓ ప్రక్కన సన్నాహాలు చేస్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పటికే ఈ చిత్రం నిర్మాతలతో నెగోషియోషన్స్ జరుపుతున్నారు.

 డీల్ కనుక ఫైనల్ అయితే నెట్ ప్లిక్స్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం  చూడాల్సిందే. 

‘‘వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్‌ ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంద’’ని చిత్ర  టీమ్ తెలిపింది.
 
మరో ప్రక్క ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు నాగ్‌. అదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కనున్న సినిమా అని సమాచారం. విజయవంతమైన ‘గరుడవేగ’ తర్వాత ప్రవీణ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే.

Follow Us:
Download App:
  • android
  • ios