Asianet News TeluguAsianet News Telugu

నాగ్ 'వైల్డ్' లాజిక్.. ఎక్స్‌పీరియన్స్ అంతే!

 ‘మన్మథుడు 2’ తో నాగార్జున వెనకబడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ పైనే ఆయన దృష్టి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. 
 

Nagarjuna wild dog latest Updates
Author
Hyderabad, First Published Jun 16, 2020, 2:17 PM IST

ఆ మధ్యన రకుల్ ప్రీతి సింగ్ తో చేసిన ‘మన్మథుడు 2’ తో నాగార్జున వెనకబడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ పైనే ఆయన దృష్టి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. 

కరోనా వైరస్ తీవ్రత తగ్గేవరకు చిత్ర టీమ్ థాయ్‌లాండ్ వెళ్లవద్దని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్దితులు కనపడటం లేదు. అసలు హైదరాబాద్ లో షూటింగ్ జరపటమే కష్టంగా ఉంది. ఈ నేపధ్యంలో షూటింగ్ విషయమై ఏం చేద్దామని దర్శకుడుతో నాగ్ చర్చించారట. హైదరాబాద్ లో సెట్ వేసి షూట్ ఫినిష్ చేయగలమా లేక కొంతకాలం ఆగుదామా అనేది చర్చ సారాంశం. తనకేమీ అర్జెంట్ లేదని, ఇప్పుడిప్పుడే షూటింగ్ మొదలెట్టాయని లేదని చెప్పారట. మిగతా షూటింగ్ లు ప్రారంభమై ట్రైల్స్  సక్సెస్ అయితే అప్పుడు చూద్దామన్నారట. ఈ లోగా హైదారాబాద్ లో ఏ లొకేషన్ లో సెట్ వేయకుండా ఫినిష్ చేయచ్చో చూడమన్నారట. మరీ సెట్ వేయాలనుకుంటే తక్కువలో అవుతుందనుకుంటేనే ముందుకు వెళ్దామని ప్రపోజల్ నాగ్ పెట్టారట. ఇలా నిర్మాత సైడ్ నుంచి నాగ్ ఆలోచించటంతో చాలా ఆనందపడుతున్నారట. 

అయితే ఈ సినిమా ఎనభై శాతం షూట్ ఫినిష్ అయ్యి ఉండటంతో ..మిగతా షూటింగ్ ని కొద్ది రోజుల్లో హైదరాబాద్ లో కష్టపడి ఫినిష్ చేసినా థియోటర్స్ రిలీజ్ లేనప్పుడు కంగారు ఎందుకనేది నాగ్ లాజిక్.  షూటింగ్ పూర్తైతే ఓటీటికి ఈ సినిమా ఇచ్చేయాలా వద్దా అనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్దామన్నారట. 26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. 

ఇక ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌వర్మ గా నాగ్ కనిపిస్తారు.  నూతన దర్శకుడు అషిషోర్‌ సోల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’.  వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదు. ఓ హాలీవుడ్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించలేదు. అలాగే పాటలు ఉండవు కాబట్టి రీరికార్డింగ్ బాగా ఇచ్చే వారిని సంగీత దర్శకుడుగా తీసుకోబోతోన్నట్లు సమాచారం.

 `గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios