కింగ్ నాగార్జున హిమాలయాలలో చెమటలు చిందిస్తున్నారు. ఆయన తన టీమ్ తో కలిసి టెర్రరిస్టులను వేటాడుతున్నారు. ఎన్ ఐ ఏ కమాండర్ గా శత్రువలను చిత్తు చేస్తున్నారు. వైల్డ్ డాంగ్ షూటింగ్ కోసం కులుమనాలి వెళ్లిన నాగార్జున ఈ సాహస కృత్యాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టింది. రానున్న రెండు రోజుల్లో ఎనిమిది వారాలు పూర్తి కావడంతో పాటు హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. 

గత వారం బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున హాజరుకాలేదు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులుమనాలి రావడం వలన హోస్ట్ బాధ్యలు సమంతకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. కాగా గతవారం సమంత బిగ్ హోస్ట్ గా అదరగొట్టారు. ఆమె హోస్టింగ్ స్కిల్స్ అద్భుతం అని అందరూ ప్రశంసించారు. 

కాగా నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం బాగా కష్టపడుతున్నారని అర్థం అవుతుంది. కులుమనాలి భీకర ఫారెస్ట్ లో ఎన్ ఐ ఏ కమాండర్ గా నాగార్జున తన టీమ్ సభ్యులతో పోరాటాలలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ నాగార్జున బయట పెట్టారు. ఆయన సోషల్ మీడియా వేదికగా వైల్డ్ డాగ్ షూటింగ్ స్టిల్స్ విడుదల చేశారు. 

బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, సయామీ ఖేర్ వంటి నటులు నాగార్జున టీం లో ఉన్నట్లు తెలుస్తుంది. నాగార్జున ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అశిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.