Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: 'మ‌న్మ‌థుడు 2' రిలీజ్ డేట్ ఫిక్స్!

నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. 

Nagarjuna'S latest Manmadhudu -2 release date fix
Author
Hyderabad, First Published Jul 15, 2019, 3:22 PM IST

 

నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ని నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు. సాహో రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 కావటంతో రిలీజ్ డేట్ ఛేంజ్ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. వాటిని నమ్మవద్దని మొదట అనుకున్న డేట్ కే వచ్చేస్తామని నాగ్ క్లారిటీ ఇచ్చారన్నమాట.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.  అలాగే చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.  

ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌9న విడుద‌ల చేయ‌నున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios