Asianet News TeluguAsianet News Telugu

'బంగార్రాజు' నలిగిపోతున్న డైరక్టర్.. కారణం నాగ్ ?

ఓ సినిమా హిట్ అయ్యాక...దాని సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్లాన్ చేయటం కష్టమేమి కాదు..సినిమావాళ్లకు అది అలవాటైన పనే. 

Nagarjuna's "BANGAR RAJU"  script not locked still now
Author
Hyderabad, First Published Apr 4, 2019, 10:28 AM IST

ఓ సినిమా హిట్ అయ్యాక...దాని సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్లాన్ చేయటం కష్టమేమి కాదు..సినిమావాళ్లకు అది అలవాటైన పనే. అయితే అసలు చిక్కంతా దాన్ని తెరకెక్కించాక జనాల్లోకి తీసుకెళ్లి మెప్పించటంలోనే వస్తోంది. సాధారణంగా ఈ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ భాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం అనాదిగా జరుగుతోంది. 

అందుకు కారణం తొలి సినిమా చూసిన జనం ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని సీక్వెల్ సినిమా చూడటానికి రావటం,వాటిని అందుకోవటంలో టీమ్ దెబ్బతినటం జరగటం జరుగుతోంది. అయితే ఆ పొరపాటు తన బంగార్రాజు చిత్రానికి జరగకూడదని నాగ్ భావిస్తున్నారట. దాంతో డైరక్టర్ చెప్పిన స్క్రిప్టుకు రకరకాల మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇవి ఓ రకంగా డైరక్టర్ పై ప్రెజర్ పెంచే విషయమే. అలాగని నాగ్ ఆ జాగ్రత్త తీసుకోకపోతే సినిమా తేడా కొట్టేస్తుంది. 

వాస్తవానికి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో కింగ్ నాగార్జున `సొగ్గాడే చిన్ని నాయ‌నా` సినిమాకు సీక్వెల్ గా `బంగార్రాజు` తెర‌కెక్కిస్తున్నామ‌ని ప్ర‌క‌టించి చాలా కాల‌మ‌వుతోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించింది లేదు. `సొగ్గాడే చిన్ని నాయ‌నా` త‌ర్వాత  క‌ళ్యాణ్ తెర‌కెక్కించిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో నాగ్ కు ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్నాడంటున్నారు.

దాంతో   ఆ సినిమాను హోల్డ్ లో పెట్టి..రీసెంట్ గా మ‌రోసారి ఆ ప్రాజెక్ట్ పై వివ‌ర‌ణ ఇవ్వ‌డంతోనే రేపో మాపో సెట్స్ కెళ్తుందనుకున్నారు. `మన్మ‌ధుడు-2` తో పాటే ఏక‌ధ‌థాటిగా ఆ సినిమాకు ప్రారంభించే అవ‌కాశాలున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి.  కానీ విశ్వనీయ వర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్రకారం బంగార్రాజు సెట్స్ కెళ్ల‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్టేటట్లు ఉందిట.

బంగార్రాజు స్క్రిప్టు  లాక్ అయిందని మీడియాతో చెప్పినా ఇంకా క‌థ విష‌యంలో నాగ్ ఇంకా ముందుకు వెనక్కి మార్పులు చేస్తున్నారట.   వీలైనంత వ‌ర‌కూ స్టోరీకి,  సోగ్గాడే చిన్నినాయిన కథకు పోలిక రాకూడదని, అలాగే పాత్ర‌ల‌కు ఫ్రెష్ లుక్ తీసుకురావాల‌ని డైరెక్ట‌ర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారుట‌. దీంతో డైరక్టర్  క‌ళ్యాణ్ స్క్రిప్టు పై రోజులు తరబడి పనిచేస్తున్నాడట.  ఎప్పటికి తేలుతుందో అని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనం. 

Follow Us:
Download App:
  • android
  • ios