ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ అని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాదు..వేరే హీరో సీన్ లోకి వచ్చారంటున్నారు.


 బిగ్ బాస్ సీజన్ 7 నుంచి హోస్టింగ్ కు నాగార్జున (Nagarjuna) గుడ్ బై చెప్పినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాను రాను షో రేటింగ్‌ పడిపోతున్న నేపథ్యంలో నాగ్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి తోడు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌, మరికొన్ని అన్‌ ఫెయిర్‌ నిర్ణయాల విషయంలోనూ నాగ్ అసంతృప్తిగా ఉన్నారట.

అదే సమయంలో నాగార్జునపై బోలెడన్ని విమర్శలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ అంటే చాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడే సీపీఐ నారాయణ అయితే నాగార్జునపై దారుణమైన కామెంట్లు చేశారు. ఇదొక బూతు దందా, బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఈషోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ నేపథ్యంలో.. బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త హోస్ట్ ను వెతికే పనిలో పడింది. వచ్చే ఏడాది మధ్యలోనే ఈ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటి నుండి ఈ సీజన్ కోసం బిగ్ బాస్ టీమ్ కొత్త హోస్ట్ ను వెతుకుతున్నారని. టాలీవుడ్ కు చెందిన ఒక యువ హీరో ఈసారి హోస్ట్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ అని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాదు..వేరే హీరో సీన్ లోకి వచ్చారంటున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నాగార్జున ప్లేస్ లోకి ఇప్పుడు మరో యూత్ లోక్రేజ్ ఉన్న మరో హీరో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అతను మరెవరో కాదు బాహుబలి రానా. నెంబర్ వన్ యారి కి హోస్ట్ గా ఆకట్టుకుని రానా అయితే బిగ్ బాస్ స్టేజ్ పై బావుంటుంది అని భావిస్తున్నారట. అటు రానా కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు రెడీగా ఉన్నారనే మాట వినిపిస్తుంది.

రానా... కొత్త ప్రాజెక్ట్ లు ఒప్పుకోవడం లేదట, బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే మళ్ళీ ఆడియన్స్ ముందుకు రావొచ్చు, ఇది పెద్దగా స్ట్రెస్ లేని పని కావడంతో బిగ్ బాస్ హోస్ట్ గా రానా ఒప్పుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూడాలి..ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందనేది... నాగ్ ప్లేస్ లో సీజన్ 7 కి రానా వస్తాడో లేదంటే నాగ్ కంటిన్యూ అవుతాడో అనేది అతి త్వరలోనే తేలనుంది.