Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున ముద్దివ్వబోతే ఆ కామెంట్ చేసిన ఫైమా.. వేదికపై ఆసక్తికర సంఘటన, నవ్వులే నవ్వులు

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు.

Nagarjuna once again give kiss to Faima
Author
First Published Dec 18, 2022, 7:51 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇప్పుడు వీరిలో విజేత ఎవరు, 2 స్థానం, 3 వ స్థానం ఎవరికి దక్కబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది. 

ఆట పాటలు, మాజీ హౌస్ మేట్స్ సరదా కబుర్లు, టాప్ 5లో ఉన్న వారి కుటుంబాల సందడి ఇలా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే హుషారుగా సాగుతోంది. నాగార్జున ప్రతి కంటెస్టెంట్ వీక్ నెస్ ని ఫన్నీగా చెబుతూ నవ్విస్తున్నారు. అలాగే ఇంటి సభ్యులంతా హౌస్ లో జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. 

మాజీ హౌస్ మేట్స్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని నాగార్జున అడగగా ఆది రెడ్డి.. ఫైమా పేరు చెప్పారు. దీనితో నాగార్జున బెస్ట్ డ్యాన్సర్ అవార్డు ఇచ్చేందుకు ఫైమాని వేదికపైకి పిలిచారు. ఇక్కడ చాలా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నాగార్జున ఫైమా చేయి పట్టుకుని ముద్దు ఇవ్వబోయారు. దీనితో ఫైమా ఉలిక్కి పడి అయ్యో వద్దు సర్ అంటూ ఇబ్బంది పడిపోయింది. 

మీరు ముద్దులు ఇస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు సర్ అంటూ ఫైమా కామెంట్ చేయడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఫైమా ఎలిమినేట్ అయినప్పుడు కూడా నాగార్జున ఆమె చేతిపై ముద్దు పెట్టారు. ఇలా ముద్దుల మీద ముద్దులు పెడుతుంటే నాకు నిద్ర రావడం లేదు అని ఫైమా పేర్కొంది. ఇది కచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనే. 

Follow Us:
Download App:
  • android
  • ios