షాక్: ఆన్ లైన్ లో నాగ్ ఆ పాఠాలా..?
ఈ చిత్రం లో వైల్డ్ డాగ్ తరహాలోనే స్పెషల్ ఆఫీసర్ రోల్ చేస్తున్నా కానీ చాలా కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకోసం ఫస్ట్ టైమ్ నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
కింగ్ నాగార్జున దూకుడు మీదన్నారు. ‘వైల్డ్ డాగ్’ రీసెంట్ గా విడుదల చేసిన ఆయన .., బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు నాగ్ కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతుయారు. గరుడవేగ చిత్రంతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న కొత్త సినిమా ఆ మధ్యన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం లో వైల్డ్ డాగ్ తరహాలోనే స్పెషల్ ఆఫీసర్ రోల్ చేస్తున్నా కానీ చాలా కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకోసం ఫస్ట్ టైమ్ నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
ప్రస్తుతం కోవిద్ సెకండ్ వేవ్ నడుస్తుండడంతో విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. అలాగే విదేశీ ట్రైనర్ ను కూడా పిలిపించుకోలేడు.ఇక వేరే ఆప్షన్ లేక నాగార్జున ఆన్లైన్ లోనే మార్షల్ ఆర్ట్స్ కోర్స్ తీసుకుంటున్నాడట. కాకపోతే డైరక్ట్ గా ఫేస్ టు ఫేస్ నేర్చుకోవాల్సిన మార్షిల్ ఆర్ట్స్ కోర్స్ ...ఆన్ లైన్ లో నేర్చుకోవటం ఏమిటి అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రవీణ్ సత్తారు నాగ్‌ని సరికొత్తగా చూపించనున్నారు. నాగ్ ను వినూత్నంగా చూపించేందుకు ప్రవీణ్ సత్తారు చాలా హోంవర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పక్కాగా స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి కావడంతో, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శరత్ మరార్ కు చెందిన నార్త్ స్టార్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇతర తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు.