Asianet News TeluguAsianet News Telugu

రిస్క్ తక్కువ అనే నాగ్ గ్రీన్ సిగ్నల్

ఇప్పటికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నాగ్ కు సినిమాలు పరంగా గత కొద్ది కాలంగా హిట్ అనేది దొరకటం లేదు. అయినా విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయన ప్లాన్స్ కు కరోనా దెబ్బ కొట్టింది. లేకపోతే వైల్డ్ డాగ్ టైటిల్ తో చేస్తున్న సినిమా ఈ పాటికి రిలీజ్ కు రెడీ అయ్యేది. ఈ నేపధ్యంలో నాగార్జున ..సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఖాలీగా ఉండటం కన్నా టీవి షో కంటిన్యూ చేయటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారట.

Nagarjuna is thinking to begin Bigg Boss Season 4
Author
Hyderabad, First Published Jun 22, 2020, 2:04 PM IST

మనకున్న సీనియర్ హీరోల్లో నాగార్జున ఒకరు. ఆయన ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు. దానికి దగ్గ ఫలితాలు సాధిస్తూంటారు. ఇప్పటికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నాగ్ కు సినిమాలు పరంగా గత కొద్ది కాలంగా హిట్ అనేది దొరకటం లేదు. అయినా విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయన ప్లాన్స్ కు కరోనా దెబ్బ కొట్టింది. లేకపోతే వైల్డ్ డాగ్ టైటిల్ తో చేస్తున్న సినిమా ఈ పాటికి రిలీజ్ కు రెడీ అయ్యేది. ఈ నేపధ్యంలో నాగార్జున ..సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఖాలీగా ఉండటం కన్నా టీవి షో కంటిన్యూ చేయటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారట.

సినిమా అయితే బోలెడు మంది ఆర్టిస్ట్ లతో ముందుకు వెళ్ళాలి. అదే బిగ్ బాగ్ షో కోసం అయితే ఎక్కువశాతం తను ఒంటరిగా నిలబడి మాట్లాడతూ లాగేయచ్చు. తను జనాల్లో ఉన్నట్లూ ఉంటుంది. ఆదాయం ఉంటుంది..ప్రమాదరహితం అని బిగ్ బాస్ 4 యాంకరింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఎలాగో బిగ్ బాస్ కు ఎంపిక చేసిన వారికి ముందుగానే అన్ని టెస్ట్ లు చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారు కాబట్టి ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు ..వైరస్ లోపలకి వ్యాపించే అవకాసం ఉండదని భావిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ అంటే ఓ రకంగా క్వరైంటైన్ లాంటిదే అని బిగ్ బాస్ కు ఎంపిక చేసేవారు కూడా భావించి ముందుకు వస్తారని ఆశిస్తున్నారు.  ఈ మేరకు మాటీవి టీమ్ ఈ షో లో పాల్గొనే వాళ్ల కోసం ఎంపిక మొదలెట్టిందని సమాచారం. 

ఇక రియాలిటీ గేమ్ షో, టీఆర్పీ రేటింగ్స్ లో ముందుండే బిగ్ బాస్ కు అన్ని భాషల్లాగే తెలుగులోనూ మంచి వ్యూయ‌ర్ షిప్ ఉంది. దాంతో జులైలోనే సీజ‌న్ 4 రావాల్సి ఉంది. అంటే జూన్ లోనే షూటింగ్ మొద‌ల‌వ్వాలి. కానీ లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప్రస్తుతం టీవి సీరియల్స్ ప్రారంభం కావటంతో ఈ షో షూటింగ్ కు తెర తీస్తున్నారు. కోర‌నా వైర‌స్ ప్రభలకుండా ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా… బిగ్ బాస్ క్రూ ని తగ్గించుకోకపోతే కష్టం అంటున్నారు.  ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎక్కువ క్రూ అయితే మెయింటేన్ చేయ‌టం క‌ష్ట‌మైన ప‌నిగా యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్లు చ‌ర్చ సాగుతోంది.  ఇక బిగ్ బాస్ 4వ సీజ‌న్ లో హీరో త‌రుణ్, సింగ‌ర్ మంగ్లీ, యాంక‌ర్ వ‌ర్షిణి, కమెడియ‌న్ హైప‌ర్ ఆది స‌హా మ‌రికొంద‌రి పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios