ఊహించిన విధంగానే జరిగింది. నేటి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను బిగ్ బాస్ యాజమాన్యం ప్రేక్షకులను ఫూల్స్  ని చేశారని స్పష్టం అయ్యింది. అనేక ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్న సుమ బిగ్ బాస్ ఎంట్రీ పై అనుమానాలుండగా అవి నివృత్తి అయ్యాయి. 

నేడు బిగ్ బాస్ షోలో ఒక ప్రోమో విడుదల కాగా అందరినీ షాక్ కి గురి చేసింది. చేతి నిండా అనేక ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్న సుమ కనకాల బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. చివరికి అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని నిరూపించారు. లగేజీతో పాటు బిగ్ బాస్ వేదిక పైకి ఎంటరైన సుమ, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆదుకున్నారు. 

ముఖ్యంగా లాస్యది కవరింగ్ స్మైల్ అని, అవినాష్ బిస్కెట్స్ వేస్తున్నాడని, అఖిల్ మోనాల్ లవ్ ట్రాక్ తో పాటు, సోహైల్ కోపాన్ని బాగా ఇమిటేట్ చేసిన సుమ  షోని పరుగులు పెట్టించారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి సుమ ఎంటర్ అవుతున్నట్లు చివరి వరకు నమ్మించిన నాగ్ చివర్లో ఝలక్ ఇచ్చారు. నాగార్జున కేవలం ఇవాళ ఎపిసోడ్ ని ఎంటర్టైన్ చేయడానికి సుమ వచ్చినట్లు చెప్పడం జరిగింది. దీనితో ప్రేక్షకులతో పాటు, హౌస్ మేట్స్ షాక్ అయ్యారు.