అక్కినేని యువ హీరో నాగ చైతన్య మొత్తానికి మజిలీ సినిమాతో సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే నెక్స్ట్ ఎలాగైనా మరో మంచి హిట్ అందుకోవాలని చైతు తనకు సెట్టయ్యే కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మొదటిసారి ఈ యువ హీరో పూర్తిగా తెలంగాణ అబ్బాయిగా తెరపై కనిపించబోతున్నాడని టాక్. 

రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతన్య పూర్తిగా తెలంగాణ కుర్రాడిగా కనిపించబోతున్నాడట. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో సాయి పల్లవిని తెలంగాణ అమ్మాయిగా చూపించి అందరిని ఆకర్షించాడు. 

ఇక ఇప్పుడు నాగ చైతన్య పాత్రను కూడా అదే తరహాలో పక్కా మాస్ కుర్రాడిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చైతూకి జోడిగా నటించబోయే సాయి పల్లవి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. అలాగే కమ్ముల మరో చిత్రం షూటింగ్ ఎండింగ్ లో ఉంది. ఆ సినిమా అయిపోగానే చైతూ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.